రామ్ చరణ్ మీద తమిళ మీడియాలో సెటైర్లు, హీరో విశాల్ వల్లే....

By Bojja Kumar

సినీన‌టుడు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని సోమవారం ఉదయం ద‌ర్శించుకున్నారు. దర్శనం అనంతరం అక్కడే ఉన్న మీడియా అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ స్పందించిన తీరు అరవ మీడియాలో దుమారం రేగింది.

నటుడు విశాల్ తమిళనాడులో జరుగనున్న ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్నారు. ఈ అంశంపై స్పందించాలని రామ్ చరణ్‌ను కోరగా విశాల్ ఎవరు? అంటూ మీడియా వారిని ఎదురు ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తనకు తెలియదని తెలిపారు.

తమిళ మీడియాలో దుమారం

తమిళ మీడియాలో దుమారం

విశాల్ ఎవరో నాకు తెలియదు అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించడంతో తమిళ మీడియాలో అతడిపై సెటైర్లు వేస్తూ వార్తా కథనాలు వస్తున్నాయి. విశాల్ తెలుగు ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి, అతడి సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతాయి. అలాంటి విశాల్ గురించి రామ్ చరణ్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ వార్తలు ప్రసారం చేశాయి.

వివాదంలో ఇరుక్కోవడం ఇష్టంలేకనే రామ్ చరణ్ అలా

వివాదంలో ఇరుక్కోవడం ఇష్టంలేకనే రామ్ చరణ్ అలా

అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేకనే విశాల్ విషయంలో రామ్ చరణ్ అలా స్పందించినట్లు తెలుస్తోంది. తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నందున్న ఏది మాట్లాడినా వివాదం అయ్యే అవకాశం ఉండటంతో రామ్ చరణ్ ఇలా స్పందించారు.

తిరుమలలో చెర్రీతో పాటు కళ్యాణ్ కూడా

తిరుమలలో చెర్రీతో పాటు కళ్యాణ్ కూడా

కాగా... తిరుమల దర్శనానికి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు చరణ్ చెల్లెలు శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ కూడా ఉన్నారు. తిరుమలలో రామ్ చరణ్‌ను చూసేందుకు అభిమానులు పోటీప‌డ్డారు. 'జూనియ‌ర్ మెగాస్టార్‌' అంటూ నినాదాలు చేశారు.

 రంగస్థలం

రంగస్థలం

ప్రస్తుతం రామ్ చరణ్ ‘రంగస్థలం' అనే సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. త్వరలోనే ఈ చిత్రం మార్చి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X