Kalki 2898 AD: కల్కిలో గెస్ట్ రోల్ చేసిన స్టార్లు వీళ్లే.. అసలు ఎవరు ఏ పాత్రలో కనిపించారంటే!
సాధారణంగా ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలిచి హైలైట్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకుని అంచనాలను పెంచుకుంటుంటాయి. అలాంటి చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ బిజినెస్‌ను జరుపుకుని గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'కల్కి 2898 ఏడీ' మూవీ గెస్ట్ రోల్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలను మీరే చూడండి!
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన క్రేజీ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఎంతో హైప్ క్రియేట్ చేసుకుని ఇది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500 థియేటర్లలో తీసుకొచ్చారు.

'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన వచ్చింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అందుకు తగ్గట్లుగానే టాక్ కూడా పాజిటివ్‌గానే వస్తోంది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయన్న టాక్ వినిపిస్తోంది.
'కల్కి 2898 ఏడీ' సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందులో చాలా మంది స్టార్లను కూడా భాగం చేశారు. అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులను అతిథి పాత్రల్లో చూపించారు. అందులో చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు కూడా కనిపించారు. తద్వారా ఈ సినిమాకు మరింత ఆకర్షణను తీసుకు వచ్చారు.

టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి కారు డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. ఆయన ప్రభాస్ బుజ్జితో పోటీ పడుతూ కొన్ని డైలాగులు పలికారు. అలాగే, రాజమౌళి ఓ డీలర్‌గా కనిపించారు. వీరితో పాటు అర్జుణుడి పాత్రలో విజయ్ దేవరకొండ మెస్మరైజ్ చేశాడు. అంతేకాదు, దుల్కర్ సల్మాన్ సైతం కీలక పాత్రను చేశాడు. వీళ్లు మాత్రమే కాదు.. మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్, బ్రహ్మానందం కూడా మెరిసి మెప్పించారు. వీళ్ల పాత్రలను మీరే తెరపై చూసేయండి.

ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











