For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎవరు అతడు?... ధోనీ పేరెత్తగానే భగ్గుమన్న లక్ష్మీరాయ్!

  By Bojja Kumar
  |
  Julie 2 Actress Raai Laxmi About Dhoni, "Who is he"?ధోనీ పేరెత్తగానే భగ్గుమన్న లక్ష్మీరాయ్!

  సౌత్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం లక్ష్మీరాయ్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది.

  ఈ సినిమా ముందు వరకు ఉత్తరాది ప్రేక్షకులకు లక్ష్మీ రాయ్ నటిగా పరిచయం లేదు. గతంలో ధోనీ గర్ల్ ఫ్రెండుగా ఆమె వార్తల్లో నిలిచింది... ఆ విధంగా మాత్రమే లక్ష్మీ రాయ్ చాలా మంది బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం.

  ఎఫైర్ వార్తలు ఇంకా...

  ఎఫైర్ వార్తలు ఇంకా...

  2008లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టుకు లక్ష్మీరాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ... ఇప్పటికీ అందుకు సంబంధించిన వార్తలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి.

  జూలీ 2 ప్రమోషన్స్‌లో ధోనీ గురించి

  జూలీ 2 ప్రమోషన్స్‌లో ధోనీ గురించి

  తాజాగా ‘జూలీ 2' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న లక్ష్మీరాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ధోనీకి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వడంతో లక్ష్మీ రాయ్ అసహనానికి గురయ్యారు.

  ఇప్పటికైనా ఆపండి అంటూ ఫైర్

  ఇప్పటికైనా ఆపండి అంటూ ఫైర్

  ధోనీ ప్రస్తావన రాగానే... అతడు ఎవరు? ఇప్పటికైనా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ ప్రస్తావనం అనవసరం, కొన్ని విషయాలు వర్కౌట్ కావు. వాటిని వదిలేసి ముందుకు సాగాల్సిందే అని లక్ష్మీ రాయ్ అన్నారు.

  ఇది శృంగార చిత్రం కాదు

  ఇది శృంగార చిత్రం కాదు


  ‘‘దీన్నో శృంగార చిత్రంలానే చూడొద్దు. అంతకు మించిన విశేషాలెన్నో ఉన్నాయి. హాట్‌ గాళ్‌గా నన్ను చూద్దాం అని థియేటర్లకు వచ్చిన వాళ్లని మాత్రం నిరుత్సాహపరచను'' అంటూ లక్ష్మీ రాయ్ ఈ సిినమా గురించి ప్రమోట్ చేస్తున్నారు.

  జూలీ 2

  జూలీ 2

  గతంలో నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలి'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న సినిమా విడుదల కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది.

  ఇంత సెక్సీనెస్ ఊహించలేదు

  ఇంత సెక్సీనెస్ ఊహించలేదు

  లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని అందరూ ఊహించారు. అయితే ఇందులో ఆమె న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.

  బాలీవుడ్ సెక్సీరాయ్

  బాలీవుడ్ సెక్సీరాయ్

  ఈ సినిమా విడుదల తర్వాత బాలీవుడ్ తెరపై సరికొత్త గ్లామర్ హీరోయిన్‌గా కీర్తింపబడుతుందని, ఆ సినిమా తర్వాత ఆమెను అంతా లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ.

  సినిమా కథాంశం ఏమిటి?

  సినిమా కథాంశం ఏమిటి?

  బాలీవుడ్ చీక‌టి కోణాలతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

  కాస్టింగ్ కౌచ్ గురించి?

  కాస్టింగ్ కౌచ్ గురించి?

  సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాయి. సినిమా అవకాశాల కోసం హీరోయిన్లను లైంగికంగా లొంగదీసుకోడం లాంటి సంఘటనలు ‘జూలీ 2' సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.

  ట్రైలర్

  ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ తో పాటు ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు . అక్టోబర్ 6న సినిమా రిలీజ్ కాబోతోంది.

  English summary
  South actress Raai Laxmi will soon make a splash in Bollywood with the erotic thriller Julie 2. Even though her relationship with former captain of the Indian cricket team, Mahendra Singh Dhoni, ended almost a decade ago, it continues to make headlines. When SpotboyE asked Raai Laxmi about the cricketer, she responded with, "Who's he?" She then went on to say, "This needs to have a full stop.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X