Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నేను వర్జిన్ కాదని ఎవరు చెప్పారు? హీరోయిన్ ఆగ్రహం
ఈ రోజుల్లో పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవడం అనేది సర్వసాధారణమైన విషయం. మెట్రో సిటీల్లో అయితే యువతీయువకులు పెళ్లికి ముందే కలిసి సహజీవనం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే పెళ్లి చేసుకోవడం, లేకుంటే విడిపోయి మరొకరిని చూసుకోవడం లాంటివి తరచూ వింటున్నారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?
ఇంటర్వ్యూలు, చాట్ షోలలో నటీనటులు ‘వర్జినిటీ', ‘ఫస్ట్ లవ్', ‘ఫస్ట్ కిస్' లాంటి అంశాలపై ప్రశ్నలు సైతం సినిమా సెలబ్రిటీలు ఫేస్ చేయాల్సి వస్తోంది. కొన్ని టీవీ చాట్ షోలు, ఇంటర్వ్యూలలో ‘మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?' అంటూ మొహం మీదే అడిగేస్తున్నారు.
అమైరా దస్తూర్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమైరా దస్తూర్ కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎదురు సమాధానం ఇవ్వడం హాట్ టాజిక్ అయింది.
నేను వర్జిన్ కాదని ఎవరు చెప్పారు?
‘మీరు మీ వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?' అనే ప్రశ్నకు అమైరా దస్తూర్ స్పందిస్తూ...... ‘నేను వర్జినిటీ కోల్పోయాను అని మీకు ఎవరు చెప్పారు?' అంటూ అమైరా మండి పడ్డారు.
పెళ్లి తర్వాతే ఏదైనా...
వర్జినిటీ కోల్పోవడం లాంటిది జరిగితే అది కేవలం పెళ్లి తర్వాతే.... పెళ్లికి ముందు హద్దులు దాటి సెక్సులో పాల్గొనడం లాంటివి తనకు ఇష్టం ఉండదు అని ఈ సందర్భంగా అమైరా దస్తూర్ తేల్చి చెప్పారు.
మనసుకు నచ్చింది
అమైరా దస్తూర్ లేటెస్టుగా రిలీజైన ‘మనసుకు నచ్చింది' చిత్రంలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. మంజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె నిత్య అనే పాత్రలో నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
పాపం అమైరా దస్తూర్
అమైరా దస్తూ ఇప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ చిత్రాల్లో నటించినా ఏ సినిమా కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన ఇసాఖ్, మిస్టర్ ఎక్స్, అనేగన్, కుంగ్ ఫూ యోగాతో పాటు తాజాగా విడుదలైన ‘మనసుకు నచ్చింది' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది.