Vijay Antony Daughter Suicide.. చివరిగా ఆమెతో ఫోన్ మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు?

ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రముఖ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడక ముందు ఫోన్ లో ఓ వ్యక్తితో మాట్లాడినట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ కుమార్తెతో చివరిగా మాట్లాడింది ఎవరు.. అసలు ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి.. అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ తెలుగు వారికి సుపరిచితమే. ఆయన ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒక్కహీరోగానే కాదు.. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. అంతే కాదు సౌండ్ ఇంజినీర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, ప్లే బ్యాక్ సింగర్ వంటి అన్ని రంగాల్లో ఆయనకు ప్రావిణ్యం ఉంది. ఇటీవల బిచ్చగాడు 2, హత్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Who was the last person who spoke to Vijay Antonys daughter Laara on the phone?

విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయ్ ఆంటోనీ కుమార్తె చైన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయింది. కూతురి గది వద్దకు చేరుకున్న తండ్రి విజయ్‌ ఆంటోనీ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే సిబ్బంది సహాయంతో సమీపంలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ లారాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

విజయ్ ఆంటోని కూతురు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని... ఇందుకోసం గత కొన్ని రోజులుగా మందులు వాడుతున్నాడని తేనాంపేట పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే మీరా చదువుతున్న చర్చి పార్క్ స్కూల్‌తో పాటు ఆమె స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

Who was the last person who spoke to Vijay Antonys daughter Laara on the phone?

లారా చివరిగా మాట్లాడింది ఎవరితో.. ఆమె స్నేహితులు ఎవరు... వంటి వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లారా ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో తేనాంపేట పోలీసులు మీరా చివరిసారిగా ఎవరితో మాట్లాడింది.. ఏం మాట్లాడింది అనే విషయాలపై ఆమె ఫోన్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కావేరీ ఆసుపత్రిలో శవపరీక్ష జరుగుతుంది. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని విజయ్ ఆంటోనీకి అప్పగించనున్నారు.

Who was the last person who spoke to Vijay Antonys daughter Laara on the phone?

ఇక ఇప్పటికే విజయ్ ఆంటోనీ ఆత్మహత్యలపై చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మరాాయి. అసలు ఆత్మహత్యలకు పాఠశాలలు, తల్లిదండ్రులే కారణమంటూ గతంలో చెప్పుకువచ్చాడు. పిల్లలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావద్దని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే విజయ్ ఆంటోనీ కుమార్తె మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. సినీ ప్రముఖులు విజయ్ ఆంటోనీకి కాల్ చేసి... విషయం తెలుసుకుంటున్నారు. మరోవైపు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X