ఎవరా అంకుల్ మమతామోహన్ దాస్?
సింగర్ కమ్ యాక్టర్ మమతా మోహన్ దాస్ సినిమా పరిశ్రమ నిజస్వరూపాన్ని స్వయంగా చూడడం కాదు అనుభవించింది. హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో బహుషా ఆమెకు తెలిసివచ్చిఉండవచ్చు. ఒక సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. ఆ సినిమాకు సంబంధించిన సీనియర్ హీరో ఆమెను చెయ్యిపట్టి లాగి మరీ తన పక్కన కూర్చోబెటుటకున్నాడట. ఇలా హఠాత్తుగా చేయిపట్టి లాగడంతో ఏడ్వలేక నవ్వును మొహంపై పులుముకుని మమతా మోహన్ దాస్ అంకుల్ అంటూ కూర్చుందట. ఆమె మొహంలో ఎంబరాస్ మెంట్ కు సంబంధించిన చాయలు స్పష్టంగా కనిపించాయట. ఇంతకు ఈ సీనియర్ హీరో జ్యోక్ చేశాడా లేక ఉద్ధేశ్యపూర్వకంగానే చేశడా అనేది తెలియక ఇపుడు మమతా మోహన్ దాస్ కన్ఫ్యూషన్ లో ఉందిట. ఉద్దేశ్యపూర్వకంగానే అయితే జాగ్రత్తపడదామని ఆమె ఆలోచనట.


Click it and Unblock the Notifications











