twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి 150వ సినిమా డైరక్ట్ ఎవరు..పాయింట్ ఏంటి?

    By Srikanya
    |

    మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేసే అవకాశమందంటూ రకరకాల డైరక్టర్స్ పేరుతో రూమర్స్ వెలుబడుతున్నాయి. ఆ వినపడుతున్న పేర్లలో ఉన్న డైరక్టర్స్ పరిస్ధితి ఏమిటి అన్నది ఒక్కసారి పరిశీలించి చూస్తే...ఆయన సరదాకి అన్నా..సీరియస్ కి అన్నా దర్శకుడు శంకర్ మాత్రం ఖాలీగా లేరు. రోబో రిలీజ్ తర్వాత ఆయన త్రి ఇడియట్స్ చిత్రం రీమేక్ లో బిజీ అవనున్నారు. ఆ తర్వాత..వివి వినాయిక్ ని చూస్తే..గతంలో ఠాగూర్ తీసారు కదా అని తీసుకుందామంటే..అతను అల్లు అర్జున్ తో బద్రీనాధ్ బిజీలో మరికొన్ని నెలలు గడిపేటట్లు ఉన్నారు. ఇక క్రిష్ ని తీసుకుంటే...అతను వేదం తమిళ రీమేక్ చేసి రామ్ చరణ్ కోసం స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నారు. అలాగే చిరంజీవి లాంటి పెద్ద హీరోని కమర్షియల్ విలువలతో ప్రెజెంట్ చేయగలడా అనేది సందేహమే. ఇక వందేమాతరం తీస్తానంటున్న కృష్ణ వంశీ...ప్రస్తుతం నాగార్జున ప్యామిలీకో సినిమా, రామ్ చరణ్ కో ఓ సినిమా చెయ్యాలని కమిటై ఉన్నారు. వీరందరూ కాకుండా రాజమౌళినే తీసుకుందామనుకుంటే...నేను ఈగ సినిమా ప్రభాస్ తో సినిమా చేసే లోగా లాగిస్తాను అని ఆ గ్రాఫిక్స్ ట్రైల్ షూట్స్ చేసుకుంటూ హడావిడిగా ఉన్నాడు. ఇక మురగుదాస్..సూర్య హీరోగా ఓ భారీ చిత్రం రెడీ చేస్తున్నారు. వీళ్ళింతా ఇలా బిజీగా ఉంటే చిరంజీవి తో చేసే డైరక్టర్ ఎవరూ..అనేది మిలయన్ డాలర్ల ప్రశ్నే. ఇక చిరంజీవి ఈ చిత్రాన్ని సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా...ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో..జనవరి నెలలో ప్రారంభిద్దామనుకుంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు..ఇరిగేషన్ సమస్యలు ఆ చిత్రంలో హైలెట్ కావాలని కోరుకుంటున్నారు. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X