twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పని తక్కువ, డబ్బు ఎక్కువ, పైగా తృప్తి: అనుష్క

    By Bojja Kumar
    |

    పని చాల తక్కువ ఉంటుంది, డబ్బులు కూడా బాగా ఇస్తారు, పైగా అందులో బోలెడు తృప్తి లభిస్తుంది...అలాంటప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఎవరైనా అలాంటి వాటిని వదులుకుంటారా? అని ప్రశ్నిస్తోంది సెక్సీతార అనుష్క. ఇంతకీ అమ్మడు అంటోంది దేని గురించో తెలుసా....యాడ్ ఫిల్మ్స్ గురించే.

    నేను సంవత్సరానికి మహా అయితే రెండు మూడు సినిమాల కంటే ఎక్కువ చేయలేను. దీని వల్ల అభిమానులకు ఆ సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే తెరపై కనిస్తాను. అదే యాడ్ ఫిల్మ్స్ అయితే ప్రతిరోజూ టీవీలో నన్ను రోజుకు నాలుగు సార్లు చూసే అవకాశం దొరుకుంది. వాటి వల్ల నేను కూడా ఫ్యాన్స్ కి చాలా దగ్గరయినట్లుంటుంది. అలా కనిపించడం మనసుకు ఎంతో తృప్తినిస్తుంది అంటూ చెప్పుకొస్తోంది. వీటిలో తక్కువ పని ఉంటుంది. కేవలం ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి మంచి పారితోషికం ఇస్తారు అంటూ అసలు నిజాన్ని ఒప్పుకుంది..ఈ బెంగుళూరు సెక్సీ.

    అరుంధతి, అమలాపురం సరోజ(వేదం) పాత్రలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అవినాకు ఎంతతో పేరు తెచ్చాయి. అలా అని మళ్లీ మళ్లీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండుదు. మరిన్ని భిన్నమైన పాత్రలతో తన కెరీర్ సాగించాలనేదే నా లక్ష్యం అంటూ అనుష్క చెప్పుకొచ్చింది.

    English summary
    Sexy Actress Anushka opined that being part of Ad films is a good opportunity to stay connected with fans every time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X