బాలయ్యని ఢీ కొట్టి నిలబడగలిగే సత్తా ఎవరిదో ...
ఈ సంక్రాంతికి వస్తున్నవి నాలుగు సినిమాలైతే వాటిలో క్రేజ్, ఎక్స్ పెక్టేషన్స్ పరంగా లాస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సుమంత్ సినిమా 'గోల్కొండ హైస్కూల్". 'పరమ వీర చక్ర", 'మిరపకాయ్", 'అనగనగా ఓ ధీరుడు" చిత్రాలకి ఇప్పటికే చాలా ఆకర్షణ ఏర్సడింది. 'పరమ వీర చక్ర", చిత్రానికి బాలకృష్ణ ఫ్యాక్టర్, దాసరి నారాయణరాబు 150వ సినిమా అనే బిల్డప్ పెద్ద ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇక బాలయ్య కొమరం భీమ్ గా, రావణబ్రహ్మగా వేసిన గెటప్స్ కి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చేసింది.
కాగ 'మిరపకాయ్" చిత్రానికి రవితేజ ఫ్యాక్టర్ క్రౌడ్ పుల్లింగ్ కి పనికొస్తుంది. రొటీన్ సినిమాలే చేస్తున్నా కానీ రవితేజ సినిమాకెళితే కాసేపు టైమ్ పాస్ అయిపోతుందనే ఆడియన్స్ మైండ్ సెట్ పండుగ సీజన్ లో మిరపకాయ్ కి కలిసొస్తుంది. అయితే సిద్దార్థ నటించిన 'అనగనగా ఓ ధీరుడు" చిత్రానికి చాలానే క్రేజ్ ఉంది. ఏ సెంటర్స్ క్రౌడ్స్"చిత్రానికి పరుగులు పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి జనవరి 12న పరమ వీర చక్ర" పాటు విడుదలవుతున్న ఈ చిత్రాలు బాలయ్య తాకిడికి నిలబడుతాయో లేదో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











