అందుకోసమే 'చిరు' పై 'బాలయ్య' కస్సు బుస్సులు !?
త్వరలో చిరంజీవి వెండితెరపై కన్పించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సందేశాత్మక చిత్రంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు ఇటీవల ఫిల్మిం నగర్ లో ఊపందుకున్నాయి. ఈ చిత్రానికి పి. వాసు దర్శక్వం వహించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. సామాజిక చైతన్యం కోసమే చిరంజీవి మళ్లీ ఈ చిత్రంలో నటించనున్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ స్ర్కిప్ట్ కూడా సిద్దం చేసినట్టు సమాచారం. అయితే కోడి రామకృష్ణ ఇటీవల చిరంజీవిని కలిసి చాలా సేపు చర్చించినట్టు టాలీవుడ్ టాక్.
చిరంజీవి కోసమే తాను ఓ కథను సిద్దం చేశాననీ, చిరు తన మనసు మార్చుకుంటే ఆయనతో సినిమా చేయాలని కోడిరామకృష్ణ అనుకుంటున్నట్టు భోగట్టా. ఇదిలా వుంటే మొదట్లో చిరంజీవితో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" కథను తీయాలని అనుకున్నారు. అయితే నరసింహనాయుడు సమరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించి సక్సెస్ లు సాధించిన బాలయ్య అయితే ఈ చిత్రానికి సరిపోతాడని మరికొందరు ఆయన చెవిన వేశారు. దానికి బాలయ్య సరే అన్నట్టు వార్తలు వచ్చినా ఆ తర్వాత అనివార్య కారణాల వలన వాయిదా పడిందట.
ఈ కథను చిరంజీవితో తీస్తే రాయలసీమలో చిరుకి గ్లామర్ పెరగడమే కాక సినిమా బాగా హిట్ అవుతుందని కొంతమంది చిరు చెవిన వేశారు. ఇది తెలిసిన బాలయ్య కస్సుబుస్సు లాడారట అదలావుంచితే ఈ సినిమా కోసమే చిరంజీవి స్లిమ్ గా మారారనీ, ఆయనే ఆ సినిమా చేస్తారని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరి మధ్య పోటి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











