»   » నా గురించి అలా రాస్తారా? అంటూ రేణు దేశాయ్ ఫైర్

నా గురించి అలా రాస్తారా? అంటూ రేణు దేశాయ్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి రేణు దేశాయ్ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటూ తనకు సంబంధించిన విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఆమె గుడికి వెళ్లి దేవుడిని దర్శకున్న విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఉద‌యాన్నే దేవాల‌యానికి వెళ్లి దేవుడిని ద‌ర్శించుకుంటే మ‌న‌సు ఎంత ప్ర‌శాంతంగా ఉంటుందో అంటూ సంప్ర‌దాయంగా చీర‌లో ఉన్న‌ త‌న ఫోటోను పోస్ట్ చేసింది.

రేణు దేశాయ్ ఈ ఫోటో పోస్టు చేయగానే రకరకాల కామెంట్స్ వచ్చాయి. సామాన్య జ‌నం ప్ర‌తి రోజు పూజ చేస్తారు. కానీ...సినిమా వాళ్లు మాత్రం సినిమా రిలీజ్ అవుతున్న స‌మ‌యంలోనే స‌క్సెస్ కోసం గుడికి వెళ్లి పూజా చేస్తారు. రేణు దేశాయ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇష్క్ వాలా ల‌వ్ డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ జ‌న‌వ‌రిలో రిలీజ్ అవుతుంది. అందుచేత ఈ రెండు సినిమాలు స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకునేందుకే రేణు దేశాయ్ గుడికి వె‌ళ్లార‌ని వచ్చిన ఆర్టికల్ ను ఓ వ్యక్తి షేర్ చేసారు.

దీంతో రేణు దేశాయ్ కి కోపం వచ్చింది. ఇదో స్టుపిడ్ ఆర్టికల్ అంటూ మండి పడింది. ఈ ఆర్టికల్ షేర్ చేసిన వ్యక్తికి నిజంగా పనిపాట లేదంటూ ఫైర్ అయింది.

రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఇష్క్ వాలా లవ్ విషయానికొస్తే....ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులంగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ సారు.

English summary
"Whoever wrote this stupid article seriously needs to get a life! Nijanga pani pata ledhu ee vyakti ki...:)" Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu