'రోబో' ఆడియో రిలీజ్‌కు ఐష్ రాకపోవటానికి రీజన్...
హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన రజనీకాంత్ తాజా చిత్రం 'రోబో' ఆడియో ఆవిష్కరణకు ఐశ్వర్య రాయ్ బచ్చన్ గైర్హాజరవడానికి కారణం తెలిసింది. తీవ్రమైన జ్వరం కారణంగానే ఐశ్వర్య ఈ కార్యక్రమానికి రాలేకపోయినట్లు ఆమె తరఫు ప్రతినిధి శనివారం ముంబైలో తెలిపారు. తెలుగులోనూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆమె సందేశం పంపినట్లు పేర్కొన్నారు. సినీ కెరీర్ లో తనకు మద్దత్తిస్తూ వస్తున్న తెలుగు చిత్రసీమ, హైదరాబాద్ ప్రజలకు ఐశ్వర్య కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన రోబో తెలుగు వెర్షన్ ఆడియో శుక్రవారం రాత్రి హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగింది. చిరంజీవి ముఖ్యఅతిథిగా, మోహన్ బాబు విశిష్ట అతిథిగా విచ్చేశారు.
ఐశ్వర్య రాయ్ రోబో చిరంజీవి రజనీకాంత్ ఎఆర్ రహమాన్ శంకర్ aishwarya rai ar rahman chiranjeevi rajinikanth robo shankar


Click it and Unblock the Notifications