బాలయ్యపై కోపంతోనే అక్కినేని ఫ్యామిలీ రాలేదా?
హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుడు నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖంలా హాజరయ్యారు. బాలయ్య తన రేంజికి ఏ మాత్రం తగ్గకుండా ఏర్పాట్లు చేసి అదరగొట్టారు.
ఈ వేడుకకు బాలయ్య సోదరుడు నందమూరి హరికృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. వీరు రాక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫ్యామిలీ గొడవలే అందుకు కారణం. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా బాలయ్య కూతురు పెళ్లికి ఎవరూ కూడా రాకపోవడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి ముంబై బ్యాడ్మింటన్ లీగ్‌లో ఉన్నారు కాబట్టి రాలేదని అనుకున్నా....కనీసం అక్కినేని నాగేశ్వరరావు కూడా ఎందుకు హాజరు కాలేదు? వారి ఫ్యామిలీలోని ఇతర హీరోలు ఒక్కరైనా ఈ వివాహం వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఫిల్మ్ నగర్ నుండి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం....నాగార్జున, బాలకృష్ణ మధ్య ఓ విషయంలో ఏర్పడ్డ విబేధాల వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. గతంలో నాగార్జున ఓ అవసరం నిమిత్తం బాలయ్యను సంప్రదించాడని, అయితే బాలయ్య ఎలాంటి సహకారం అందించలేదని, దీంతో నాగార్జున అప్పటి నుంచి బాలయ్యపై కోపగా ఉన్నాడని, ఆయనతో మాట్లాడటం లేదని...ఆ కారణంగానే అక్కినేని ఫ్యామిలీ బాలయ్య కూతురు కళ్యాణ మహోత్సవానికి గైర్హాజరు అయ్యారని అంటున్నారు.


Click it and Unblock the Notifications












