అల్లు అర్జున్ రంగస్థలం చూడకపోవడానికి కారణం తెలిసింది.. కొడుకు ఓ వైపు, తల్లి కోరిక మరోవైపు!
Recommended Video

రంగస్థలం చిత్రం విడుదలైన దుమ్ములేపుతోంది. రాంచరణ్ కెరీర్ లోనే నటన పరంగా, కలెక్షన్ల పరంగా ది బెస్ట్ మూవీగా రంగస్థలం చిత్రం నిలిచింది. రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి మరియు సుకుమార్ సహా చిత్రం యూనిట్ మొత్తం సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు దాదాపుగా ఈ చిత్రాన్ని చూసి రాంచరణ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కానీ మెగా ఫ్యామిలిలో మరో స్టార్ బన్నీ ఇంతవరకు రంగస్థలం చిత్రం చూడకపోవడానికి మెగా అభిమానుల్లో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ రూమర్లకు చెక్ పెట్టేలా బన్నీ ఎందుకు రంగస్థలం చిత్రం ఇంతవరకు చూడలేదు కారణం తెలిసింది. పలు మీడియా సంస్థల్లో దీని గురించి వార్తలు వస్తున్నాయి.

కొనసాగుతున్న రంగస్థలం జోరు
రంగస్థలం చిత్రం విడుదలై ఐదురోజులు గడుస్తున్నా ఇప్పటికి ఆ చిత్ర హవా బాక్స్ ఆఫీస్ ముందు కొనసాగుతూనే ఉంది. అంతలా సుకుమార్, రాంచరణ్ తో కలసి మ్యాజిక్ చేసాడు. 1980 నాటి పరిస్థితులని నేటి తరం ముందు ఆవిష్కరించాడు.

ప్రశంసల వర్షం
రంగస్థలం చిత్రాన్ని ఎన్టీఆర్, రానా వంటి స్టార్ హీరోలు చూసి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. రాంచరణ్ అద్భుతమైన నటన కనబరిచాడంటూ ప్రశంసలు దక్కాయి. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఈ చిత్రాన్ని చూసి అభినందించారు.

పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా
బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రాంచరణ్ రంగస్థలం చిత్ర స్పెషల్ షో ని ప్రదర్శించాడు. రంగస్థలం చిత్రం చూసిన పవన్ చరణ్, సుకుమార్ కు అభినందనలు తెలిపాడు.

బన్నీ ఇంకా
మెగా కుటుంబంలో మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ ఇంకా రంగస్థలం చిత్రం చూడకపోవడంతో అభిమానుల్లో చర్చ జరుగుతోంది. బన్నీ రంగస్థలం చూడకపోవడానికి కారణం ఏంటని చర్చ సినీవర్గాల్లో కూడా జోరుగా సాగుతోంది.

అంత విషయం లేదు
బన్నీ రంగస్థలం చిత్రం చూడకపోవడానికి కారణం తెలిసిందంటూ పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం మెగా అభిమానులు చర్చించుకోవాల్సినంత విషయం లేదని అంటున్నారు.

కారణం అదే
బన్నీ నా పేరు సూర్య చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో తన కుటుంబసభ్యుల కోసం కూడా బన్నీ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటీవల బన్నీ ఫ్యామిలీ యుఎస్ టూర్ ముగించుకుని వచ్చిన సంగతి తెలిసిందే. బిజీగా ఉండడం వలెనే బన్నీ రంగస్థలం చిత్రం చూడలేకపోయాడనే వాదన వినిపిస్తోంది.

కొడుకు ఓవైపు, తల్లి మరో వైపు
ఇటీవలే బన్నీ తన తనయుడు అయాన్ 4 వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. దీనితో కొడుకు కోసం సమయాన్ని కేటాయిస్తూ బన్నీ బిజీగా గడిపాడు. ఆ తరువాత రంగస్థలం చిత్రం చూద్దామని భావించినా తన తల్లి నిర్మల కోరిక మేరకు ఆగాడట. ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసే బదులు అభిమానుల మధ్య థియేటర్ కు వెళ్లి ఫ్యామిలీ మొత్తం చిత్రాన్ని చూద్దాం అని ఆమె బన్నీని కోరారట. తల్లి కోరికకు బన్నీ ఒకే చెప్పాడని సరైన సమయంలో రంగస్థలం చిత్రం చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











