గీతా గోవిందంకు ముఖం చాటేసిన అల్లు అర్జున్.. పరుశురాంకు షాక్ అలా!

కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యే విధానం జనాలనే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సరే రెండు వారాల కంటే ఎక్కువ రోజులు హడావిడి చేయలేవు. అది కూడా సక్సెస్ అయితేనే లేకుంటే.. విడుదలైన వీకెండ్ లోనే జనాలు మర్చిపోతుంటారు. ఇక గీత గోవిందం సినిమా సాధించిన విజయం మాత్రం కొన్ని నెలల వరకు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఊహలకు అందలేదు..

ఊహలకు అందలేదు..

2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం సినిమా ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. అసలు ఆ స్థాయిలో విజయం దక్కుతుంది అని చిత్ర యూనిట్ కలలో కూడా అనుకోలేదు. విజయ్ దేవరకొండ - రష్మీక మందన్నల రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆయుధంలా మారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది.

 విజయ్ బిగ్గెస్ట్ హిట్..

విజయ్ బిగ్గెస్ట్ హిట్..

అర్జున్ రెడ్డి సినిమా అనంతరం.. విజయ్ ఏంటి..? ఇలాంటి సినిమాతో వస్తున్నాడు అని కామెంట్స్ వచ్చాయి. కానీ రిలీజ్ తరువాత సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజయ్ దేవరకొండకి ఫ్యాన్ అయిపోయారు. 10కోట్లు కూడా ఖర్చు కానీ ఆ సినిమాకు రిలీజ్ అనంతరం 130కోట్లకు పైగా వసూళ్లు రావడం అందరికి షాకిచ్చింది.

బన్నీకి ఇష్టమైన సినిమా..

బన్నీకి ఇష్టమైన సినిమా..

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమాల్లో గీత గోవిందం ఒకటి. ఆ సినిమాతో బన్నీ.. విజయ్ దేవరకొండకు ఫ్యాన్ అయిపోయాడు. అయితే ఆ సినిమా మొదట గీత ఆర్ట్స్ నిర్మాతలకు చెప్పినప్పుడు బన్నీ కూడా ఉన్నాడట. అప్పుడే బన్నీ ఇది మంచి హిట్టు సినిమా అని చెప్పేశారని దర్శకుడు పరశురామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Recommended Video

IFFI 2019 : Rashmika Mandanna About How She Deal With Trolls
అల్లు అర్జున్ ఎందుకు చేయలేదు..

అల్లు అర్జున్ ఎందుకు చేయలేదు..

గీత గోవిందం కథ వినగానే అల్లు అర్జున్ ఈ సినిమా చేయాలని అనిపించిందట. కానీ అప్పటికే సరైనోడు లాంటి కమర్షియల్ మాస్ సినిమా రావడంతో అభిమానుల అంచనాల కారణంగా సినిమా కథపై ఎఫెక్ట్ పడవచ్చని చేయలేదట. అనవసరంగా ఒక మంచి కథను చెడగొట్టడం ఇష్టం లేక బన్నీ కొంత మంది హీరోలను సజెస్ట్ చేశాడట. కానీ ఎవరు కూడా చేయకపోవడంతో దర్శకుడు పెళ్లి చూపులు తరువాత విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X