రేఖతో అఫైర్‌పై అమితాబ్ ఎందుకు అలా...
ముంబై: అమితాబ్ బచ్చన్, రేఖల మధ్య లవ్ అఫైర్ ఎందుకు అంత ఆసక్తికరంగా మారింది, రేఖతో ప్రేమాయణాన్ని అమితాబ్ ఎందుకు ఖండించారనేది ఇప్పటికి జవాబుల దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా పండిందనేది అందరికీ తెలిసిన విషయమే. అందాల భామ తారకు 58 ఏళ్లు నిండాయి. కానీ, ఆ ప్రేమాయణం మాత్రం నిన్న మొన్న నడిచినట్లుగానే చర్చనీయాంశంగా ఉంది.
రేఖ, అమితాబ్ ప్రేమాయణం ఎప్పటికీ ఓ మిస్టరీగానే, కథగానే ఉండిపోయింది. తమ ప్రేమగాధపై అమితాబ్ మాట్లాడకపోవడంతో అదొక పొడుపుకథగా మారిందని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. 1984లో రేఖ ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం మాట్లాడింది. తన ప్రేమాయాణాన్ని అమితాబ్ ఎందుకు ఖండించకూడదని ఆమె అడిగింది. తన ఇమేజ్‌ను, తన కుటుంబాన్ని, పిల్లలను రక్షించుకోవడానికి అమితాబ్ అలా చేసి ఉండవచ్చునని, ఇది అత్యంత సుందరమైందని, దాని గురించి ప్రజలు ఏమనుకుంటారనేది తనకు అనవసరమని ఆమె అన్నారు. తాను ఆయనను ప్రేమిస్తున్నానని గానీ ఆయన తనను ప్రేమిస్తున్నాడని గానీ ప్రజలకు ఎందుకు తెలియాలని అడిగింది.
తాను అతన్ని ప్రేమిస్తున్నానని, అతను తనను ప్రేమిస్తున్నాడని, అంతేనని అంటూ ఎవరు ఏమనుకుంటున్నారనేది తనకు అవసరం లేదని, ప్రైవేట్‌గా అతను ఆ మాట అని ఉంటే తాను అసంతృప్తి చెందేదాన్నని, అలా ఆయన ఎన్నాడైనా చేశాడా అని అడుగుతున్నానని రేఖ అన్నది. పబ్లిక్‌లో మాట్లాడినదాన్ని తాను ఎందుకు పట్టించుకోవాలని అడిగింది. అమితాబ్ పాత మనిషి అని, ఎవరినీ బాధపెట్టడం ఆయనకు ఇష్టం ఉండదని, అటువంటప్పుడు ఆయన భార్యనెందుకు బాధపెట్టాలి అని అన్నది.
తనకు చాలా మంది పిల్లలు కావాలని, అది ఫాంటసీగా మారిపోకూడదని అనుకుంటున్నానని, 30 ఏళ్లనాటికి సంతానం పొందాలని తన తల్లి చెబుతుందని, అది సరైందేనని, తన పిల్లలు తనతో పాటు పెరగాలని అప్పట్లో రేఖ అన్నది.
అక్టోబర్ పదో తేదీతో ఆమెకు 58 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంది. పిల్లలను కనాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ అమితాబ్ లవ్ అఫైర్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. రేఖ సమక్షంలో ఆయన చాలా అసౌకర్యంగా ఉంటారు. అది ఎప్పటికీ బయటకు రాదు, ఊహాగానంగానే ఉండిపోతుంది.


Click it and Unblock the Notifications











