అనూష్కని 'తెల్ల ఏనుగు' అని పిలుస్తున్నారు ఎందుకంటే
హాట్ స్టార్ అనూష్కని తెలుగు,తమిళ పరిశ్రమలో తెల్ల ఏనుగు అని పిలుస్తున్నారు. దానికి కారణం ఆమె తీసుకునే రెమ్యునేషన్ తో సమానంగా ఆమె కూడా వచ్చే సిబ్బందికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటోంది.ఆమె రెమ్యునేషన్ దాదాపు కోటి రూపాయలు వరకూ తీసుకుంటోంది. అందువల్ల ఆమెను బుక్ చేయాలంటే భయపడుతున్నారు. అందులోనూ ఆమెను కాంటాక్ట్ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సూపర్ స్టార్ సాయం చేయందే ఆమెను కలుసుకోవడం కూడా కుదరదని తమిళ పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
ఎవరా సూపర్ స్టార్ అంటే ఇంకెవరూ నాగార్జునే అనేది జగమెరిగిన సత్యం. ఇక
మంగుళూర్ కు చెందిన ఈ అందగత్తె ప్రస్తుతం నాగార్జున సరసన ఢమురకం లోనూ, ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ చేస్తోంది. మరికొన్ని ఒప్పుకోవాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె నటించిన నాన్న త్వరలో విడుదల కాబోతోంది. విక్రమ్ సరసన ఆమె చేసిన పాత్రకు మంచి అప్లాజ్ వస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











