అందుకే అనుష్కకి సినిమాలు లేవు
అనుష్కకి ప్రస్తుతం తెలుగులో 'డమరుకం",పవన్ కళ్యాణ్ చిత్రం తప్ప సినిమాలు ఏమీ లేవు. దానకి కారణం సినిమా ఆఫర్స్ రాకపోవటం కాదని చెప్తోంది అనుష్క. ఆమె మాటల్లోనే..'ఇక పై సెలెక్టివ్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నాను. రొటీన్ చిత్రాలు ఎన్ని చేసినా ఎలాంటి ప్రయోజనం వుండదు కదా. అందుకే ఇక నుంచి నాకు ప్రత్యేకంగా అనిపించే, కథా బలం వున్న చిత్రాల్లోనే నటించాలనుకుంటున్నాను. మోహమాటానికి పోకుండా ఏదిపడితే అది అంగీకరించకుండా సెలెక్టీవ్‌గా చిత్రాలు అంగీకరిస్తున్నాను"అంది. అందుకే ఆమెకు కంటిన్యూగా ఆఫర్స్ వస్తున్నా కమిట్ కావటం లేదంటోంది. ఇక ఆమె తమిళంలో సెల్వరాఘవన్ రూపొందించనున్న ఓ ద్విభాషా చిత్రంతో పాటు, కార్తీ కథానాయకుడిగా రూపొందనున్న మరో ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది. వీటితో పాటు తెలుగులో చైతన్య దంతులూరి తెరకెక్కించనున్న'రంపచోడవరం"చిత్రంలోనూ నటించనుంది.
ఇక ఢమురకం విషయానకి వస్తే...శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనుష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











