కాంప్రమైజ్ కానని పూరీకి చెప్పేశాను: బాలకృష్ణ
పూరి జగన్నాథ్ కథ నచ్చకపోవడంతో నేను కాంప్రమైజ్ కానని ఆయనకు చెప్పేశాను. కథ ముఖ్యమండి. దాని తర్వాతే నిర్మాత. పూరీ జగన్నాధ్ కథ ఓ.కే అయితే ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభించి, విజయదశమికి సినిమాని విడుదల చెయ్యాలనుకున్నాం అంటున్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఓ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసింది. ఆ విషయం ప్రస్దావిస్తూ బాలకృష్ణ..నిర్మాతల గురించి కూడా మాట్లాడారు. ఆయన మాటల్లోనే...షూటింగ్ లో జరిగే ప్రతి విషయం నిర్మాతకు తెలియాలి. కొందరు దర్శకులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ వాళ్ల మనుషులే అంతా ఉండాలని చెప్పి నిర్మాతను అనామకుణ్ని చేసేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. సమస్య ఎక్కడ వస్తోందంటే అనుకున్న సమయానికి సినిమాలు పూర్తి కాకపోవడం వల్లే. కొన్ని సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు మూడేళ్లు పడుతోందని వింటున్నాం. అలా ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదు. నిర్మాతకు అవగాహన, సినిమా మీద కంట్రోలు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పారు. ఇక పూరీ జగన్నాధ్ రెండు కథలు..బాలకృష్ణకు చెప్పారని, టైటిల్ గా అనుచరుడు అని చెప్పేడని తెలుస్తోంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ లేవని బాలకృష్ణ రిజెక్టు చేసారని సమాచారం.


Click it and Unblock the Notifications











