బాలయ్య భీష్మ ఆగిన కారణం
బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో రమేష్ వర్మ దర్శకుడుగా ప్లాన్ చేసిన భీష్మ చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రాజెక్టు ఆగిపోవటానికి కారణాలంటూ రకరకాల కథనాలు వినపడుతున్నాయి.మొదటగా రమేష్ వర్మ అందించిన స్క్రిప్టు మ్యాన్ ఆన్ ఫైర్ అనే హాలీవుడ్ చిత్రానికి కాపీ అని..కథకీ భీష్మ అనే టైటిల్ కీ ఎక్కడా సంభంధం లేదని తేల్చేస్తున్నారు. అయితే బాలయ్య ఫైనల్ వెర్షన్ స్క్రిప్టుని తనకు నమ్కకస్తులైన సీనియర్స్ రైటర్స్ కి చూపే ఆపారని తెలుస్తోంది. ఇక మరో ప్రక్క బాలయ్య శ్రేయాభిలాషులు కొందరు మళ్ళీ బెల్లంకొండతో సినిమా అవసరంలేదని గట్టిగా చెప్పటంతో ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు. ఏదైమైనా చిరకాలం తర్వాత తిరిగి బాలయ్య, బెల్లంకొండ కలవటంతో మంచి ప్రాడెక్టు వస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం రమేష్ వర్మ మరో పెద్ద హీరోకి కథ చెప్పేందుకు సంసిద్దులవుతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











