twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో... ఇక్కడ పొదుగులు కోసేస్తారు, అందుకే వదిలేశా: బండ్ల గణేష్

    |

    టాలీవుడ్ టాప్ స్టార్లతో వరుస సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ కొన్ని ఆర్థిక వివాదాల కారణంగా సినిమా రంగానికి దూరం అయ్యారు. అయితే తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు.

    పార్టీ టిక్కెట్ సంపాదించడంలో విఫలమైనప్పటికీ ఎన్నికల వేళ.... బండ్ల గణేష్ తన ఇంటర్వ్యూలతో హడావుడి చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    తాజాగా బండ్ల గణేష్‌ను ఓ టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    వామ్మో.. ఇక్కడ పొదుగులు కోసేస్తారు

    వామ్మో.. ఇక్కడ పొదుగులు కోసేస్తారు

    ఆరు నెలలు కూడా రాజకీయాల్లో లేరు. అంతలోనే ఇంత వైరాగ్యం ఎందుకొచ్చింది? అనే ప్రశ్నకు బండ్ల గనేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఇక్కడ పొదుగులుకోసేస్తారు. ఇంజక్షన్ కూడా ఇవ్వరు... నొప్పితో అల్లల్లాడిపోవాలి. పొదుగులు కోసినట్లు మనకు కూడా తెలియదు. వాష్ రూంకు వెళ్లిన తర్వాతే తెలుస్తుంది. అదీ రాజకీయం అంటే.'' అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

    తప్పు చేశానని లెంపలేసుకున్న బండ్ల గణేష్

    తప్పు చేశానని లెంపలేసుకున్న బండ్ల గణేష్

    రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశాను అంటూ బండ్ల గణేష్ లెంపలేసుకున్నారు. నాబోటి వాడు రాజకీయాలకు పనికా రాడు అని తెలిపారు. ఇక్కడ నెగ్గుకురావడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఏదో ఉత్సాహంలో తెలియక బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ పూర్తి ఇంటర్వ్యూ విడుదలైన ఆయన ఎందుకు రాజకీయాలను వదిలేశారు అనేది వెల్లడి కానుంది.

    మళ్లీ సినిమాల వైపు బండ్ల గణేష్

    మళ్లీ సినిమాల వైపు బండ్ల గణేష్

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్.. తిరిగి సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా కాకుండా నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆయన చివరిగా 2012లో వచ్చిన మహేష్ బాబు మూవీ ‘బిజినెస్‌మేన్'లో నటించారు.

    ఏ సినిమా ద్వారా అంటే..?

    ఏ సినిమా ద్వారా అంటే..?

    త్వరలో ప్రారంభం కాబోయే మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమా ద్వారా బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నటుడిగా తన ప్రస్తానం కొనసాగించబోతున్నారట. ఈ విషయాన్ని ఆయన అఫీషియల్‌గా ప్రకటించలేదు. మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ అయిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Bandla Ganesh has quit politics recently. In an interview promo with a programme of 'Encounter With Murali Krishna', Bandla Ganesh was asked various questions pertaining to his recent political experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X