బ్రహ్మానందం,మెంటల్ కృష్ణ రిలేషన్?

మెంటల్ కృష్ణ పోసాని ప్రజారాజ్యంని సమర్ధించటం వల్లనే బ్రహ్మానందం ఈ సినిమాకు కమిట్ అయ్యాడంటున్నారు. ఎందుకంటే బ్రహ్మానందం కూడా పోసాని లాగే చిరంజీవికి సపోర్టు చేస్తున్నాడు కాబట్టే ని చెబుతున్నాడు. అందులోనూ వరస హిట్స్ తో దాదాపు తన భుజాలపైనే సినిమాను మోస్తూ హిట్లు ఇస్తున్న ఆయన కాదన్నా,డేట్స్ ఎడ్జెట్ కాలేదన్నా కాదనే వారు లేరని,అలా ఇష్టం లేని చాలామందికి ఆయన చెప్తూంటారని అంటున్నారు.
అయితే అధికారికంగా బ్రహ్మానందం చిరంజీవి పార్టీలో జాయిన్ కాలేదు. అయినా ఆయన పీఆర్ పీ తరుపున తన సొంత ఊర్లో నిలబడతాడని ఆ మధ్య రూమర్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇదే కారణం అంటున్నారు. అయినా ప్రస్తుతం ఎక్కడే టాపిక్ రన్ అయినా చివరకు దాన్ని రాజకీయాలుతో ముడిపెడుతున్నారు.ఇక మెంటల్ కృష్ణ సినిమాలో బ్రహ్మానందం పోసాని ఇంట్లో ఉద్యోగస్ధుడుగా జాయిన్ అవుతాడు. ఒకానొక సన్నివేశంలో సత్యకృష్ణన్ లైన్ చేయమని పోసాని పురమాయిస్తే ఆమెకు సైట్ కొట్టి తన్నులు తింటాడు. అలాగే ఈ పాత్ర శ్రీను వైట్ల ఢీ కి కొనసాగింపులా నన్ను ఇన్వాల్స్ చెయ్యద్దు అనే డైలాగుతో ముందుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











