భువనేశ్వరి త్రాగి రోడ్డుపై చిందేటయం వల్లనే...

By Srikanya

చెన్నై: సినీ నటి భువనేశ్వరిపై మరోసారి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పూర్వపరాలు బయిటకు వచ్చాయి. ఆమె ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రార్ధనా థియోటర్ వద్ద తాగి, తనతో పాటు వచ్చిన హై కోర్టు లాయిర్ దామోదర్ కృష్ణన్ తో కలిసి డాన్స్ వేయటంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో సినిమాకు వచ్చిన కుమార్ అనే వ్యక్తి కారును వీరు తమ కారుతో ఢీ కొట్టారు.

ఢీ కొట్టటమే కాకుండా తాగిన మత్తులో భువనేశ్వరితో పాటు వచ్చిన లాయిర్ ...వారి ఫ్యామిలీని కొట్టడానికి ప్రయత్నించాడు. ఈలోగా పోలీసులు వచ్చాయి.అయితే భువనేశ్వరి ఇదేమీ పట్టించుకోకుండా భువనేశ్వరి రోడ్డుమీదే డాన్స్ మొదలు పెట్టింది. ఇలా గొడవని పెంచి పెద్దది చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. సేలయూరుకు చెందిన కుమార్‌ తన కుటుంబంతో ఆదివారం రాత్రి ఈజంబాక్కంలోని ఓ థియేటర్‌కు వచ్చారు. నటి భువనేశ్వరి కూడా దామోదరకృష్ణన్‌ అనే వ్యక్తితో సినిమా చూసేందుకు చేరుకున్నారు. అక్కడ దామోదరకృష్ణన్‌కు, కుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో మరికొందరు వచ్చి కుమార్‌పై దాడి చేశారు.

సమాచారం తెలియడంతో సంఘటన స్థలికి నీలాంగరై ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి చేరుకున్నారు. ఆయనపైనా కొందరు దాడి చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు భువనేశ్వరితోపాటు మిగతావారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయమై తన తప్పేమీ లేదని భువనేశ్వరి అంటోంది. అయితే ఆమె మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.

గతంలో కూడా భువనేశ్వరి వ్యభిచారం కేసులో అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే మరో సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడటంతో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై సిటీ ఏంటీ ప్రాసిట్యూషన్ వింగ్ తమకు అందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రైడ్ చేసారు. అలాగే ఈ బ్రోతల్ నెట్ వర్క్ లో మరికొందరు సినిమావాళ్ళు ఉన్నారని ఆమె ప్రకటించి సంచలనం రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X