చార్మి..'మంగళ' ఆలస్యానికి అసలు కారణం
చార్మి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మంగళ'.షూటింగ్ ప్రారంభమై చాలా కాలమైంది. దాంతో ఫైనాన్సియల్ సమస్యలంటూ రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి. దానికి సమాధానంగా తులసీరామ్ రీసెంట్ గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లారిఫై ఇచ్చారు. ఆయన చెప్పేదాన్ని బట్టి...మంగళ చిత్రం గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ చిత్రమిదని, దీని గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ మినహా పూర్తయింది. మిగిలివున్న క్లైమాక్స్ సన్నివేశాలను వికారాబాద్ లో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని దర్శకుడు తులసీరామ్ చెప్పారు. త్వరలో ఆడియోను కూడా విడుదల చేస్తామని అన్నారు.
బాగా తీయబడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఏ భాషలో ఎప్పుడు వచ్చినా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూనే ఉన్నాయని చెప్పారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. లోగడ చార్మి కథానాయికగా తాము తీసిన 'మంత్ర' చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో తెలియందికాదని, ఈ చిత్రం అంతకుమించిన హిట్ అవుతుందన్న నమ్మకముంది' అని అన్నారు. ఇక చార్మి మాట్లాడుతూ, 'మంత్ర కంటె ఈ చిత్రం రెట్టింపు హిట్ అవుతుంది. నా కెరీర్‌లో గుర్తుంచుకునే మరో మంచి చిత్రమిది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుభాష్, ప్రదీప్ రావత్, విజయ్, యువరాజ్, ఆనంద్ భారతి తదితరులు తారాగణం.ఈ చిత్రానికి మాటలు: జంధ్యం వెంకటేష్‌బాబు, ఛాయాగ్రహణం: శివేంద్ర, ఎడిటింగ్: శీను, ఫైట్స్: గణsష్, ఆర్ట్: విశాల్, డ్యాన్స్: శేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్.


Click it and Unblock the Notifications











