twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవీ శ్రీ ప్రసాద్‌ను దూరం పెట్టిన చిరు, కొరటాల.. అదే కారణమంటూ టాక్..

    |

    దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. ముఖ్యంగా ప్రేమికులు దేవీ సంగీతాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎన్నో ప్రేమ గీతాలను అందించి యూత్‌ను బాగా ఆకట్టుకున్నాడు. విషాద గీతాలైనా దేవీ తన మార్క్‌ను చూపిస్తాడు. ఇక ఐటెమ్ సాంగ్‌లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా దశాబ్దం పాటు తన హవాను కొనసాగిస్తూ వస్తున్నాడు.

     చిరు-దేవీ కాంబో అంటే అదో మ్యాజిక్కే..

    చిరు-దేవీ కాంబో అంటే అదో మ్యాజిక్కే..

    దేవీ శ్రీ ప్రసాద్‌కు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సమయంలో దేవీ సంగీతానికి ముగ్దుడైన చిరు గిఫ్ట్‌గా ఇచ్చిన వాచీని తన చేతికే పెట్టుకుని ఉంటాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ నుంచి.. మొన్న‌టి ఖైదీ నెం.150 వ‌ర‌కూ పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. అట్ట‌ర్ ఫ్లాప్ అయిన అంద‌రివాడులోనూ కొన్ని మంచి బీట్లు దొరుకుతాయి.

    కొరటాలతోనూ అదే ర్యాప్..

    కొరటాలతోనూ అదే ర్యాప్..

    ఇక కొర‌టాల శివ - దేవిశ్రీ ప్ర‌సాద్‌ల‌దీ అంత‌కంటే మించిన కాంబో. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజీ, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వరుస‌గా నాలుగు బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌లు. కొర‌టాల విజ‌యాల్లో దేవిశ్రీ ప్ర‌సాద్ పాత్ర‌ని విడ‌దీసి చూడ‌లేం. కొర‌టాల క‌థ‌కు, దేవి సంగీతం బ‌లంగా మారింది.

    మారిన సమీకరణాలు..

    మారిన సమీకరణాలు..

    అయితే చిరంజీవి - కొర‌టాల కాంబోకి మాత్రం దేవిశ్రీ లేడు. ఆ ప్లేసులో మ‌ణిశ‌ర్మ వ‌చ్చి చేరాడు. నిజానికి మ‌ణిశ‌ర్మ‌కు ఇంత‌టి అవ‌కాశం వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. దేవిశ్రీ త‌ప్పుకోవ‌డానికీ, మ‌ణిశ‌ర్మ టీమ్ లో జాయిన్ అవ్వ‌డానికి చాలా ర‌కాలైన అంశాలు దోహ‌దం చేశాయని తెలుస్తోంది.

    అదే కారణమా..?

    అదే కారణమా..?

    కొర‌టాలనే ఈ సినిమాకి దేవిశ్రీ‌ని ప‌క్క‌న పెట్టాల‌నుకున్నాడు. ఒక కాంబోలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న‌ప్పుడు కాస్త బ్రేక్ తీసుకోవాల‌నుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి. ప్ర‌తీ సినిమాకీ దేవీనే ఎంచుకోవాల‌న్న రూల్ ఏమీ లేదు. మ‌రో సంగీత ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తే.. పాట‌ల్లో కొత్త‌ద‌నం తీసుకురావ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని కొర‌టాల భావించి ఉండొచ్చు.

    Recommended Video

    #Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
    తాజాగా ఇస్మార్ట్‌ హిట్..

    తాజాగా ఇస్మార్ట్‌ హిట్..

    చిరు - మ‌ణిశ‌ర్మ‌ల‌ది ఎలాంటి అనుబంధమో అందరికీ తెలిసిందే. ఈ ఇద్ద‌రి కాంబోలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. పైగా చిరు అంటే మ‌ణిశ‌ర్మ‌కి ఎంత అభిమానమో ఎన్నో సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈమ‌ధ్య `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఈత‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే సంగీతం తాను ఇవ్వ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు. అందుకే చిరు కాంపౌండ్ నుంచి మ‌ణికి మ‌ళ్లీ పిలుపొచ్చిందని టాక్.

    English summary
    Chiranjeevi And Koratala Siva Wants To Away From Devi Sri Prasad. Buzz Is That Chiranjeevi And Koratala Movie Music Director Is Mani Sharma. They Didn't Approached Devi For Choru 152.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X