విభేదాలకు ఇదే సాక్ష్యం: అవార్డుతో ఆయన ఔట్-అవార్డివ్వడానికి చిరంజీవి ఇన్

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ లోని హైచ్ఐసిసిలో సౌతిండియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు కేటగిరీకి సంబంధించి మహేష్ బాబు ఉత్తమ నటుడిగా, అనుష్క ఉత్తమ నటిగా, రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. అదే విధంగా ప్రముఖ తెలుగు నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబును ఈ వేడుకలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.

అంతా బాగానే సాగింది కానీ.... ఈ వేడుక పూర్తయిన తర్వాత చాలా మందిని ఓ డౌట్ తొలిచేసింది. చిరంజీవి-మోహన్ బాబు మధ్య కొన్ని విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయని తేలిపోయింది. ఇప్పటికీ ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు అనేది తాజాగా మరోసారి తేటతెల్లం అయింది.

ఈ ఇద్దరిని ఇండస్ట్రీలో టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్లతో పోలుస్తుంటారు చాలా మంది. గతంలో చాలా సందర్భాల్లో చిరంజీవి, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పరోక్షంగా, ప్రత్యక్ష్యంగా విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్బాల్లో ఇద్దరూ స్నేహితుల్లా కలిసిపోయినట్లు కనిపించారు.

మోహన్ బాబు వెళ్లిన వెంటనే..

మోహన్ బాబు వెళ్లిన వెంటనే..

మోహన్ బాబు అవార్డు తీసుకుని అక్కడి నుండి నిష్ర్కమించిన వెంటనే చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. నిర్వాహకులు ఆయనకు ఎదురెళ్లి సాదర స్వాగతం పలికారు.

తన స్నేహితుడి కోసం..

తన స్నేహితుడి కోసం..

తన స్నేహితుడు, మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టికి అవార్డు ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకకు వచ్చేసారు.

చిన్న చిన్న విబేధాలే

చిన్న చిన్న విబేధాలే

చిరంజీవి, మోహన్ బాబు మధ్య చెప్పుకునేంత పెద్ద గొడవలు ఏమీ లేవు. ఏవో చిన్న చిన్న ఇగో ఇష్యూలే అంటుంటారు ఇండస్ట్రీ జనాలు.

కలిసి కలవనట్లు...

కలిసి కలవనట్లు...

చిరంజీవి, మోహన్ బాబు కలిసి కలవనట్లు ఉంటుంటారు. కొన్ని తప్పని సరి సందర్భాల్లో ఇద్దరూ మీడియాకు స్నేహితుల్లా ఫోజు కొడుతుంటారు అనే వాదన కూడా ఉంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో మోహన్ బాబు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకుని వెళ్లి పోయే వరకు చిరంజీవి ఈ వేడుకలోకి అసలు ఎంట్రీ ఇవ్వలేదు. రామ్ చరణ్, ఇతర హీరోలు ముందుగానే ఈ వేడుక వద్దకు చేరుకున్నా... చిరంజీవి మాత్రం మోహన్ బాబు ఈవెంట్ పూర్తయ్యే వరకు రాలేదు. ఆయన కావాలనే ఆలస్యంగా వచ్చరని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X