twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ పెళ్లికి దాసరి ఎందుకు రాలేదు?

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు,నిర్మాత,నటుడు దాసరి నారాయణ రావు నిన్న(గురువారం)జరిగిన రామ్ చరణ్ పెళ్లి వేడుకలలో కనపడలేదు. సినీరంగం నుంచి అతిరథ మహారథులు విచ్చేసినా దాసరి నారాయణరావు లేకపోవటం చర్చనీయాంశమైంది.సిటిలా లేరా..లేక ఏదన్నా ఆర్జెంట్ పని ఉండి రాలేదా,లేక మరేదన్నా వ్యక్తి గత కారణాలతో రాలేకపోయారా అని చాలా మంది చర్చించుకోవటం జరుగుతోంది.

    అయితే తన గౌరవానికి తగ్గ రీతిలో అహ్వానం అందకపోవడంతో మనస్తాపానికి గురైన దాసరి ఈ వేడుకకు గైర్హాజరైనట్టుగా తెలిసిందని ఓ లీడింగ్ పేపర్ రాసుకొచ్చింది. ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ లో ఘనంగా జరిగింది.

    ఈ వివాహానికి సినీ ప్రముఖులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు దంపతులు, వెంకటేష్, జమున, శ్రీదేవి, బోనీకపూర్, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, శత్రఘ్నసిన్హా, రాధిక, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, అంబరీష్, సుమలత, రానా, శ్రీయ, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, శ్రీనువైట్ల, జయంత్ సి.పరాన్జీ, బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీ, శ్రీకాంత్ దంపతులు, సి.అశ్వనీదత్, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.అచ్చిరెడ్డి, దిల్‌రాజు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు వచ్చి తమ ఆశ్వీవచనాలను అందచేసారు.

    English summary
    
 Wedding of Ram Charan and Upasana has held at Temple Tree Farms in Gandipet Yesterday in a hugely erected set by art director Anand Sai at Temple Tree Farms, Gandipet, outskirts of Hyderabad. The couple tied knot at 9.30 AM asper the Hindu customs with both the families’ blessings. Dasari Narayana rao not attend to this marriage. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X