జూ ఎన్టీఆర్‌కు నవంబర్ నెల అంటే భయమెందుకు? యంగ్ టైగర్‌ను భయపెట్టేదెవరో మీకు తెలుసా?
RRR తర్వాత వచ్చిన దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని కొట్టాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతకు మంచి వసూళ్లను సాధించింది. కొరటాల శివతో కలిసి రెండో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ఈ క్రమంలో నందమూరి అభిమానులు ఫుల్లుగా సంతోషంలో ఉన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్, కొరటాలకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులు షేర్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియో వివరాల్లోకి వెళితే...
కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే హిట్టు కొడుతామనే నమ్మకం ఫ్యాన్ప్‌లో ఉంటుంది. అయితే ఆ నమ్మకాన్ని ఈ గ్రేట్ కాంబో ఎప్పుడూ వమ్ము చేయలేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్, ఇటీవల రిలీజైన దేవర కూడా అదే ప్రూవ్ చేసింది. అయితే ఈ సక్సెస్ ఫుల్ జర్నీలో భాగంగా జనతా గ్యారేజ్ సినిమా ప్రమోషన్‌లో తన అత్యంత స్నేహితుడైన రాజీవ్ కనకాలతో సరదాగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచుకొన్నారు.

అయితే జనతా గ్యారేజ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో రాజీవ్‌ను యాంకర్ ఓ ప్రశ్న వేస్తూ.. మీకు ఎన్టీఆర్ అంటే ఎందుకు అంతా ఇష్టం అంటే.. చెప్పడానికి మొహమాట పడుతూ.. ఎన్టీఆర్ వైపు చూశాడు. దాంతో ఆయన చిరునవ్వు నవ్వితే.. ఎన్టీఆర్ అంటే అని కొంత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కవర్ చేసుకొంటూ.. ఎన్టీఆర్ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని వెల్లడించారు. దాంతో పక్కనే ఉన్న నిత్య మీనన్ కూడా అవును. ఆయనది కిడ్ మెంటాలిటీ అనగానే.. రాజీవ్, ఆమె లైక్ మైండెడ్ మెంటాలటీలకే తెలుస్తుంది అని రాజీవ్ అన్నారు.
అయితే రాజీవ్ కనకాల మాటలకు అడ్డు పడుతూ.. నవంబర్ వస్తే నాకు భయం. నవంబర్ 14వ తేదీన నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పంపిస్తాడు. ఇప్పటికి నాకు కొడుకు పుట్టిన ఆ మెసేజ్ వస్తూనే ఉంటుంది. నవంబర్ నెల వచ్చిందంటే.. ఇలాంటి మెసేజ్ వస్తుందనే భయం నన్న వెంటాడుతుంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.

అయితే రాజీవ్ ఫోన్‌లో నా నెంబర్‌కు కిడ్ అని పేరు పెట్టుకొన్నాడు. ఇప్పటికే ఆ పేరునే అతడి మొబైల్‌లో ఉంటుంది అని మరో సీక్రెట్ లీక్ చేశాడు. అంతే కాకుండా రాజీవ్ కనకాలను ఇరుకున పెట్టేందుకు.. అతడి నంబర్ ను నా మొబైల్‌లో రాజు అని ఫీడ్ చేసుకొన్నాను. దాని వెనుక ఓ సీక్రెట్ ఉంది అని హింట్ ఇచ్చాడు. అయితే రాజీవ్ ఇబ్బంది పడటంతో ఆ సీక్రెట్ చెప్పడానికి నిరాకరించాడు.
అయితే రాజీవ్, ఎన్టీఆర్ మధ్య ఉండే స్నేహ బంధాన్ని గొప్పగా చెప్పుకొంటారు. యంగ్ టైగర్‌కు అత్యంత సన్నిహితులైన వారిలో రాజీవ్ కనకాల ఒకరు. స్టూడెంట్ నంబర్ 1 సినిమా షూటింగులో పరిచయమైన ఇద్దరు.. మంచి స్నేహితులుగా మారిపోయారు. తారక్ ప్రతీ సినిమాలో రాజీవ్ బలమైన పాత్ర ఉండటం తెలిసిందే. వారిద్దరి స్నేహం గురించి ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకొంటారు.


Click it and Unblock the Notifications











