For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రంభ విడాకుల వార్తలు... తప్పంతా మీడియాదే అని... ఇప్పుడు మళ్ళీ విడాకుల కోర్టుకెక్కింది

  |

  తొంబైల్లోనే బికినీల రేంజ్ కి తెలుగు సినిమాని ఎగబాకించిన హాట్ హీరోయిన్ లు ముగ్గురే నగ్మా, రమ్యకృష్ణ, రంభ. అప్పట్లో ఎక్స్పోజింగ్ విషయం లో పెద్ద మొహమాట పడకుండా కష్ట పడి పని చేసింది ఈ ముగ్గురే... అయితే నగ్మా అసలు కనిపించకుండానే పోగా... కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న రన్య కృస్ణ మాత్రం అడపా దడపా మంచి పాత్రలనే అందిపుచ్చుకుంటోంది. అయితే 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో పూర్తీ స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది.

  హాట్ అండ్ సెక్సీ అంద చందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో ఒకప్పుడు దక్షిణాదిని ఓ ఊపు ఊపిన తార రంభ. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన రంభ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని చెన్నై కుటుంబ న్యాయస్థానంలో సినీ నటి రంభ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఖండిస్తూ... తన వైవాహిక జీవితం ఆనందంగానే ఉన్నా కావాలనే ఇలా రాస్తూ తనని భాదపెడుతున్నారు అంటూ... తప్పంతా మీడియా మీద వేసి విరుచుకు పడింది కూడా.. ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ..తాను చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని గడుపుతున్నట్లు చెప్పింది.

   Why did Rambha approach Family Court again

  తను,తన భర్త,తన కూతురుతో హ్యాపీ లైఫ్ గడుపుతూంటే ఎలా ఈ విడాకులు వార్తలు వచ్చాయో తెలియటం అని వాపోయింది. ఇక వెబెసైట్స్ లో ఇలాంటి వార్తలు వస్తున్నాయని,అలాంటి బేస్ లెస్ వార్తలను చూస్తే చాలా భాధ వేస్తుందని చెప్పింది. తన అభిమానులు ఎవరూ కూడా తన డైవర్స్ విషయంలో వచ్చిన రూమర్స్ ని నమ్మవద్దని కోరింది. మీడియా వారిని కూడా అలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు నిజా నిజాలు తెలుసుకోవటం మేలని అంది. తీరా ఆ ఇంటర్వ్యూ ఇచ్చి నెలకూదా గడవకముందే... ఇప్పుడు మళ్ళీ తన విడాకుల విషయం లో కోర్టుకెక్కిందట. విడాకుల కోసం కొంతకాలం ముందే ఫైల్ చేయగా.. ఇప్పుడు పిల్లల పెంపంకం కూడా తననే ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.

  కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాభన్ నుకెనడాలో సెటిలైన ఎన్నారై బిజినెస్‌మేన్ ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ ఏప్రిల్ 8, 2010లో వివాహ మాడింది. తిరుపతిలో వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. వీరికి ఇద్దరు సంతానం కూడా. అయితే.. దుష్యంతి సెల్వ వినాయకం అనే మహిళతో అతనికి ముందే వివాహం అయిన విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నాడనేది రంభ వాదన.

  పెళ్లి సమయంలో తెలియకపోయినా.. ఆ తర్వాత విషయం తెలిసి చాలా విచారించిందట రంభ అలియాస్ విజయలక్ష్మి. భర్త ద్వారా చాలా ఇబ్బందులు పడ్డానని కోర్టుకు చెబుతోందీమె. కెనడాలో రంభ భర్త వేసిన పిటిషన్ కారణంగా పిల్లలకు దూరం కావాల్సి వచ్చినా.. ఆ తర్వాత పై కోర్టులో కేసు వేసి మరీ పిల్లలకు దగ్గర కాగలిగింది రంభ. ఆఖరికి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినా కూడా.. కెనడా కోర్టు తిరస్కరించింది. తన పిల్లలు చట్టబద్ధంగా తనకే చెందాలంటూ రంభ వేసిన పిటిషన్ పై జనవరి 21.. 2017న కోర్టు విచారణ జరపనుందని సమాచారమ్.

  English summary
  Actress Rambha on Saturday moved a Family Court seeking the custody of her two children. She wants the court to appoint her as a guardian of her kids.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X