పోలీస్ క్రైం బ్రాంచ్ చీఫ్‌ను హీరోయిన్ ఎందుకు కలిసింది?
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ సోమవారం ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ చీఫ్ హిమాంశు రాయ్‌ని కలిసారు. తన తర్వాతి హిందీ మూవీ 'మర్దాని' చిత్రంలో రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ల పని తీరు, బాడీ లాంగ్వేజ్, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందనే అంశాలను పరిశీలించేందుకు ఆమె ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. దాదాపు గంట పాటు పోలీస్ ఆఫీసర్లతో రాణి ముఖర్జీ సమావేశం అయ్యారు.
'తన రాబాయే సినిమా 'మర్దాని'లో రాణి ముఖర్జీ క్రైం బ్రాంచ్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. క్రైం బ్రాంచ్ ఆఫీసర్ల పని తీరు, కేసుల విచారణ ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన తీరు, బాడీ లాంగ్వేజ్, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి ఆమెకు తెలుసుకున్నారు' అని రాయ్ తెలిపారు.
అదే విధంగా ప్రమాదకర పరిస్థితులను, ఆపరేషన్స్ పోలీస్ ఆఫీసర్లు ఎలా ఎదుర్కొంటారు? అనే విషయాల గురించి పరిశీలించారు. 'ఆమె పోలీసులకు సంబంధించిన విషయాలను చాలా శ్రద్ధగా తెలుసుకున్నారు. ఆసక్తిగా పరిశీలించారు.' అని హిమాంశు రాయ్ వివరించారు.
అయితే...పోలీసులతో మీటింగ్ అనంతరం రాణి ముఖర్జీ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ప్రదీప్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. శంకర్ గతంలో 'లగా చునారి మే దాగ్', లఫంగే పరిండే' చిత్రాలకు దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్ అధినేత ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆ సంస్థతో పని చేయడం, మీడియాతో మాట్లాడటానికి నిరాకరించడం పలు అనుమానాలకు తావచినట్లయింది.


Click it and Unblock the Notifications












