twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద రచ్చే అయ్యేలా ఉంది... సంబందం లేకున్నా రజినీ కాంత్ ఇరుక్కునాడు ??

    |

    ర‌జ‌నీకాంత్ ఒక భారత దేశానికే కాదు చాలా దేశాల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో. భారత్ తో సమానమైన మార్కెట్ విదేశాల్లోనూ రాబట్టగల స్టామినా ఉన్న ఏకైక సౌతిండియన్ స్టార్ రజినీకాంత్. అయితే రజినీకి ఎంత పాపులారిటీ ఉందో.. అంతే స్థాయిలో సూపర్స్టార్ చుట్టూ వివాదాలు కూడా అదే రేంజ్‌లో న‌డుస్తుంటాయి. క‌బాలికి ముందు ఆయ‌న న‌టించిన లింగ‌, విక్ర‌మ‌సింహ చుట్టూ బోలెడు వివాదం న‌డిచింది.

    క‌బాలి రిలీజ్‌కి ముందు అదే రేంజ్‌లో కాంట్ర‌వ‌ర్సీ వినిపించినా.. ఆ సినిమా క్రేజ్ ముందు అవేవీ నిల‌బ‌డ‌లేక‌పోయాయి. క‌బాలి సాఫీగా విడుద‌ల అవ‌డం, భారీ లాభాలు క‌ళ్ల‌జూడ‌డంతో ఇక వివాదాలేవీ లేవ‌నుకున్నారు. కానీ, ఈసారి విడుద‌ల‌యిన త‌ర్వాత‌, ఇక ఏమీ లేద‌నుకున్న టైమ్‌లో కొత్త వివాదం చుట్టుముట్టింది. తన ప్రేమయం లేకుండానే సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.

    Why Did TamiLanadu government Exempt Kabali from Paying Entertainment Tax?

    ఈ తాజా గొడవతో ఆయన నటించిన "కబాలి" చిత్రం మళ్లీ రచ్చకెక్కింది. ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఎలా కల్పిస్తారంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. తమిళ భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా, తమిళంలో పేరు పెట్టే చిత్రాలకు, హింస, అశ్లీలం లేని చిత్రాలకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తోంది. ఇందు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గిన ఈ కమిటీ అర్హత లేకున్నా భారీ బడ్జెట్‌ చిత్రాలకు పన్ను రాయితీ కల్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    ఇందుకు 'కబాలి'ని పిటీషన్‌లో ఉదాహరణగా చూపారు. ఈ చిత్రంలో రజనీకాంత్ నటించారన్న ఒకే ఒక్క కారణంగానే పన్ను రాయితీ కల్పించారన్నారు. అందువల్ల ఈ చిత్రానికి పన్ను రాయితీ కల్పిస్తూ జూలై 21వ తేదీన రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అలాగే, ఈ చిత్రానికి చెల్లించాల్సిన మొత్తం పన్ను ఆ చిత్ర నిర్మాత చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరుగనుంది. భారతీయ సినిమా చరిత్రలోనే విడుదలకు ముందు అత్యంత భారీ ప్రాచుర్యం పొందిన చిత్రంగా రికార్డుకెక్కిన "కబాలి", అందులోనూ నిర్మాణ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని రజనీకాంత్ పన్ను మినహాయింపు వివాదంలో చిక్కుకోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

    English summary
    why did the Tamil Nadu government waive the entertainment tax for Kabali when it exhibited as much violence as it did?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X