సోదరి రహస్య ప్రేమ వివాహం, బాలయ్య హీరోయిన్ డుమ్మా, సన్యాసి కావడం వల్లే?
'ఆషిక్ బనాయా ఆప్నే' అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన మాజీ మిస్ ఇండియా తనూశ్రీ దత్తా తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రెండో సినిమా తెలుగులో బాలకృష్ణ సరసన విరభద్రలో నటించిన సంగతి తెలిసిందే.
తనుశ్రీ దత్తా సోదరి ఇషితా దత్తా తాజాగా ప్రేమ వివాహం చేసుకుంది. ఇషితా దత్తా గత కొంత కాలంగా వాత్సల్ సేఠ్ ('టార్జాన్: ద వండర్ కార్' ఫేమ్) తో డేటింగ్ లో ఉంది. ముంబైలోని జూహులో గల ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్ నెస్ మందిరంలో రహస్యంగా వీరి వివాహం జరిగింది.

హాజరైన కొందరు సినీ ప్రముఖులు
ఇషితా దత్తా, వాత్సల్ సేఠ్ రహస్య వివాహానికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, కాజోల్ దంపతులు, బాబీ డియోల్, సొహైల్ ఖాన్ కూడా హాజరయ్యారు. హిందూ పద్దతిలో వీరి వివాహ వేడుక జరిగింది.

అజయ్ దేవగన్ రావడానికి కారణం
ఈ వివాహ వేడుకకు అజయ్ దేవగన్ రావడానికి కారణం..... ఆయన నటించిన హిందీ 'దృశ్యం' సినిమాలో అజయ్ పెద్ద కుమార్తెగా ఇషితా దత్తా నటించింది. తనకు సన్నిహితురాలు కావడంతో అజయ్ దేవగన్ ఫ్యామిలీతో ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

సోదరి వివాహానికి హాజరు కాని తనుశ్రీ దత్తా
అయితే సోదరి వివాహానికి తనుశ్రీ దత్త హాజరు కాలేదు. ఆమె ప్రస్తుతం సన్యాయం తీసుకుని దైవ చింతనలో ఉండటం వల్లే ఆమె హాజరు కాలేదని తెలుస్తోంది. 2010 తర్వాత ఆమె సినిమాలు మానేసి సన్యాసం తీసుకున్నారు.

సోదరితో మంచి సంబంధాలే
తనుశ్రీ దత్తా, ఇషితా దత్త మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆమె సన్యాసంలో ఉండటం వల్లనే ఈ వివాహానికి హాజరు కాలేదని అంటున్నారు. తన పెళ్లి విషయాన్ని ఇషితా దత్ ముందే తన సోదరి తనుశ్రీ దత్తాకు వెల్లడించినట్లు సమాచారం.

అమెరికాలో ఉన్న తనుశ్రీ దత్తా
ప్రస్తుతం తనుశ్రీ దత్తా అమెరికాలో ఉన్నారు. అక్కడి ఆధ్యాత్మిక కేంద్రంలో సేద తీరుతున్నారు. ఇండియాకు దూరంగా ఉండటం, పెళ్లి సమయానికి అందే అవకావం లేక పోవడం వల్లనే ఆమె ఈ వివాహానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

షూటింగులో ఆమె ప్రాణాలు కాపాడి రియల్ లైఫ్ హీరో అయ్యాడు
ఓ సారి ఇషితా దత్తా, వత్సల్ సేఠ్ కలిసి ఓ షూటింగులో ఉండగా.... ఇషితా చీర ఫ్యాన్ లో ఇరుక్కుంది. ఫ్యాన్స్ కిందకి, ఆమె పైకి ఉండటంతో చీర అందులో ఇరుక్కుని ఆమె ఫ్యాన్ మీద పడబోతుండగా వత్సల్ సేఠ్ జంప్ చేసి ఆమెను సేవ్ చేశారట. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడిందని చెబుతుంటారు సన్నిహితులు.

ఇషిత, వత్సల్ సేఠ్
ప్రస్తుతం ఆమె కపిల్ శర్మకు జతగా ‘ఫిరంగి' సినిమాలో నటిస్తోంది. వాత్సల్య సేఠ్ ‘హాసిల్' అనే సీరియల్‌లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











