వాళ్ళంతా నా సినిమాలను కాపీ కొట్టినవారే:తేజ

ఇక ఈ పరిశ్రమలో క్రియేటర్స్,ఇమిటేటర్స్ అని రెండు రకాల ఫిల్మ్ మేకర్స్ ఉంటారనీ తాను క్రియేటివ్ దర్శకుడునని అంటున్నాడు.ఇక కేక చిత్రంలో వల్గారిటీ ఎక్కువగా ఉంటుందని బయిట ప్రచారం జరుగుతోంది కదా అంటే "నా 'చిత్రం' సినిమాలో హీరో తన చేతులను హీరోయిన్ వక్ష స్దలంపై చేయవేయిబోయి ఆగిపోతాడు. అది వల్గరా..అలాంటి సన్నివేశాలు టీన్స్ మధ్య జరగవా...అదే ముమైత్ ఖాన్ చేసే శృంగార విన్యాసాలు మాత్రం వల్గర్ కాదా..మనం ఆ ఐటం సాంగ్స్ ని వల్గర్ సాంగ్స్ అని పిలవం ఎందుకంటే మన కమర్షియల్ డైరక్టర్స్ ఆ తరహా పాటలను చిత్రాలలో రిపీట్ చేస్తూ..అవే స్టాండర్డ్ అంటున్నారు. నా సినిమాల్లో అయితే వల్గారిటీ ఉంటుందని అంటారు".
అలాగే 'కేక' సినిమాను తాను దాదాపు ఐదున్నర కోట్లతో రూపొందించానని తానే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నానని అన్నాడు. అదే ఎవరైనా కొంటే తాను డెఫిసిట్ లో రిలీజ్ చేయాల్సి వస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.ఇక కేక సినిమా ఈ నెల ఇరవై మూడున రిలీజవుతోంది. రెండు రోజుల ముందు యు.ఎస్.లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా వర్కవుట్ కాకపోతే తేజ వరస ఫ్లాపులలో మరొకటి జత అవుతుంది. హిట్టయితే మరో టీనేజ్ లవ్ స్టోరీ తెలుగు పరిశ్రమకు జోడు అవుతుంది.


Click it and Unblock the Notifications











