అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, జూ ఎన్టీఆర్ దూరం.. ఎందుకు వెళ్లలేదంటే?
శ్రీరామ చంద్రుడు జన్మించిన దివ్య స్థలమే అయోధ్య. అక్కడ బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా సాగింది. దేశ ప్రజలంతా కళ్లారా ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించారు. అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు లామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగగా.. ప్రధాని మోదీ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ వేడుకలో అనేక మంది రాజకీయ, సినీ, క్రీడా, వేద పండితులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా పలువురు హీరోలు వెళ్లగా ఇద్దరికి ఆహ్వానం అందినా వెళ్లలేదు. వాళ్లే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. అయితే వీళ్లు ఎందుకు వెళ్లలేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి 22వ తేదీన అత్యంత వైభవంగా జరిగిన అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభుత్వ, ఆలయ పెద్దలతో పాటు మొత్తం పారిశ్రామిక దిగ్గజాలకు, సినీ ప్రముఖులకు, రాజకీయ నేతలకు, ఉన్నతాధికారులకు, దౌత్యాధికారులకు ఆహ్వానాలు అందాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఇలా 7 వేల మందిని అయోధ్య రావాలని పిలిచారు. అయితే ఇందులో 200లకు పైగా సినీ సెలబ్రిటీలే ఉన్నారు. అయితే ఆహ్వానాన్ని మన్నించి.. ఆ శ్రీరామచంద్రమూర్తిని కళ్లారా చూసేందుకు చాలా మందే అయోధ్యకు వెళ్లారు.

ముఖ్యంగా బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లతో పాటు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, సంజయ్ లీలా భన్సాలీ, రిషబ్ శెట్టి, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ డియోల్, కత్రినా కైఫ్ లు అక్కడికి వెళ్లారు. రజినీ కాంత్ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి ఫ్యామిలీ అంటే సురేఖ్, ఆయన కుమారుడు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లు వెళ్లారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా ఆహ్వానం అందింది. కానీ వీళ్లు మాత్రం వెళ్లలేదు.
ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వెళ్లలేకపోవడానికి రాజాసాబ్, కల్కి 2898 ఏడీ షూటింగ్ ఉండడమే అని తెలుస్తోంది. ఇటీవలే జరిగిన కృష్ణంరాజు జయంతి కార్యక్రమానికి కూడా ప్రభాస్ ఈ కారణం వల్లే హాజరు కాలేకపోయారు. అలా 40 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినా.. అయోధ్యకు వెళ్లి కళ్లారా మాత్రం ఈ శ్రీరామచంద్రమూర్తిని చూడలేకపోయారు. అయితే ఈ విషయంపై ప్రభాస్ టీం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా అదే రీజన్ అని అంతా అనుకుంటున్నారు.
మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అయోధ్యకు వెళ్లలేకపోయారు. దేవర సినిమాలో ఓ మేజర్ పార్ట్ షూటింగ్ ఉండడంతో ఇక్కడకే వెళ్లాల్సి వచ్చిందట. మరోవైపు సైఫ్ అలీఖాన్ కు గాయం కావడం ఆస్పత్రిలో చేరడం.. దేవర చిత్ర బృందానికి ఆలస్యంగా తెలిసిందట. ఇలా చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. యంగ్ టైగర్ కూడా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.


Click it and Unblock the Notifications











