జాక్సన్ అంటే ద్వేషం: వర్మ
"నాకు మైఖేల్ జాక్సన్ అంటే ద్వేషం. ఒక మనిషిలా మైఖేల్ చనిపోయినందుకు నాకు అతనిపై ద్వేషం కలుగుతోంది. జీవించేందుకు అందరిలానే శ్వాసించినందుకు నాకతనంటే ద్వేషం. కొందరి గుండెలు హఠాత్తుగా ఎలా ఆగిపోతాయో అలాంటి గుండెనే అతను కూడా కలిగి ఉండటంపట్ల ద్వేషం కలుగుతోంది అంటూ మైఖేల్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు వర్మ. తన కొత్త బ్లాగ్ rgvzoomin లో ఈ విషయాలు రాసుకుని మైఖేల్ కి నివాళి అర్పించాడు.
"నేను విజయవాడలో ఉండగా నా మిత్రుడు మైఖేల్ జాక్సన్ "థ్రిల్లర్" వీడియోను చూపించేందుకు వీడియో పార్లర్‌కు తీసుకువెళ్లాడు.స్టెప్పులు వేయడానికి బ్యాలన్స్ కోసం చూసే మన సినీ పరిశ్రమకు, అసాధారణ విలువలు కలిగి నైపుణ్యాన్ని ప్రదర్శించే హాలీవుడ్ పరిశ్రమకు మధ్య తేడా అప్పుడే గమనించాను అన్నారు. ఇక ఆ మెరుపు వేగాన్ని నేను 1996లో లైవ్ గా చూశాను. అదే ముంబయిలో జాక్సన్ పాప్ నృత్య ప్రదర్శన. నా విజయవాడ పార్లర్ వీడియో వండర్ ను కళ్లారా చూశాను.మెరుపు నృత్యాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.నిజంగా ఆరోజు నేనెన్నటికీ మరిచిపోలేను. అతని నృత్యం , గాత్రం...దానికి అనుగుణంగా సంగీతం, అన్నిటికీ మించి ఎటుబడితే అటు అవలీలగా మెలితిరిగే శరీరం...ఇలా అన్నీ చేరి నన్ను మంత్రముగ్ధుడ్ని చేశాయి అంటూ మైఖేల్ ని గుర్తు చేసుకొని మై మరచి పోయారు వర్మ.


Click it and Unblock the Notifications











