For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రాహ్మణి, తేజస్విని సినిమాల్లోకి ఎందుకు రాలేదు? బాలయ్య అల్లుడు ఏం చెప్పారంటే..

|
Reason Why Balakrishna Daughters Didn't Enter Into Tollywood || Filmibeat Telugu

సినిమా రంగంలోకి ఆడపిల్లలను పంపించడం తెలుగు ఫ్యామిలీస్‌లో చాలా తక్కువ. ఇప్పుడంటే పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది కానీ... ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అయితే టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ నుంచి ఆడ పిల్లలు ఇండస్ట్రీకి రావడం చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి లక్ష్మి, మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక ఇలా అతి కొద్ది మాత్రమే నటనవైపు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు అయితే ఎవరూ రాలేదు. తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ అల్లుడు భరత్ ఈ అంశం ప్రస్తావనకు రాగా ఆసక్తికరంగా స్పందించారు.

జూ ఎన్టీఆర్ అవసరం లేదు, మేము పనికి రాకుండా ఏమీ లేము: బాలయ్య అల్లుడి కామెంట్

తెలుగు సొసైటిలో ఇలాంటివి చాలా తక్కువ

తెలుగు సొసైటిలో ఇలాంటివి చాలా తక్కువ

నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోయన్లుగా ఎవరూ ఎందుకు రాలేదనే సందేహం మీరు ఎప్పుడూ రాలేదా? అనే ప్రశ్నకు భరత్ స్పందిస్తూ... ‘తెలుగు సొసైటీలో అమ్మాయిలను సినిమాల రంగంలో ఎంకరేజ్ చేయడం తక్కువ. కానీ ఈ జనరేషన్లో వస్తున్నారు. మోహన్ బాబుగారి అమ్మాయి లక్ష్మిగారు, నాగబాబు గారి అమ్మాయి నిహారిక ఇలా వస్తున్నారు.' అని వ్యాఖ్యానించారు.

అక్కాచెల్లెళ్లు చాలా అందంగా ఉంటారు, కానీ..

అక్కాచెల్లెళ్లు చాలా అందంగా ఉంటారు, కానీ..

ఇద్దరూ అక్కాచెల్లెళ్లు(బ్రాహ్మణి, తేజస్విని) చాలా అందంగా ఉంటారు, యాక్టింగ్ చేసే కెపాసిటీ ఉంది, వస్తే బానే ఉండేది అనే ఒక వాదన అయితే ఉంది. కానీ ఏవో కారణాల వల్ల వాళ్లు రాలేదు, వాళ్లు ఎప్పుడూ ప్రయత్నం చేసినట్లు లేరు... అని తెలిపారు.

తేజస్వినికి సినిమా రంగంపై ఆసక్తి ఉంది

తేజస్వినికి సినిమా రంగంపై ఆసక్తి ఉంది

నా భార్య తేజస్వినికి సినిమాలంటే ఆసక్తి ఎక్కువే. నటించాలని ఉండకపోవచ్చు.. కానీ ఏదో ఒక రోజు ప్రొడక్షన్ సైడ్ రావొచ్చు... అయితే ఈ విషయం ఇప్పుడే కన్‌ఫర్మ్‌గా చెప్పలేను. ఆమె ప్రొడ్యూసర్ అయితే వాళ్ల నాన్నగారికి కూడా సినిమాలు చేస్తారేమో?

సినిమా రంగంలోకి రావొద్దనే ఆంక్షలు ఏమీ లేవు

సినిమా రంగంలోకి రావొద్దనే ఆంక్షలు ఏమీ లేవు

మీ భార్యకు హీరోయిన్‌గా చేయాలనే ఆలోచన పెళ్లికి ముందు ఎప్పుడైనా వచ్చిందా? అనే ప్రశ్నకు భరత్ స్పందిస్తూ... ‘‘మేము సినిమాల్లోకి వస్తామని ఇంట్లో కూడా వారు ఇద్దరూ ఎప్పుడూ అడిగినట్లు లేరు. రావొద్దు, చేయొద్దు అనే ఆంక్షలు కూడా వారిపై ఏమీ లేవు.

ఇండస్ట్రీకి వచ్చి ఉంటే తేజస్విని మంచి హీరోయిన్ అయ్యుండేదేమో?

ఇండస్ట్రీకి వచ్చి ఉంటే తేజస్విని మంచి హీరోయిన్ అయ్యుండేదేమో?

నా భార్య తేజస్వినిలో మంచి కళాస్పూర్తి ఉంటుంది. తను చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది, ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఇస్తుంది, ఒక వేళ ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఉంటే మంచి హీరోయిన్ అయ్యుండేదేమో?... బాహ్మణి గారికి తేజస్వినితో పోలిస్తే సినిమాలపై ఇంట్రస్టు తక్కువే. ఆమెకు వ్యాపారాలపై ఆసక్తి ఎక్కువ. మా ఆవిడకు కళాపోషణ ఎక్కువ.

నేను లిమిటేషన్స్ ఏమీ పెట్టను

నేను లిమిటేషన్స్ ఏమీ పెట్టను

నేనెప్పుడూ లిమిటేషన్స్ పెట్టను. ఆవిడ ఇష్టం. సినిమాల వైపు వస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. మేము ఏ విషయమైనా ఓపెన్ గా డిస్క్రస్ చేసుకుంటాం. దాన్ని బట్టి తేజస్విని ఇపుడు నటనకంటే ప్రొడక్షన్ వైపు రావడానికే ఆసక్తి చూపుతున్నారు.

మీ కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదని మామయ్యను ఎప్పుడూ అడగలేదు

మీ కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదని మామయ్యను ఎప్పుడూ అడగలేదు

బాలకృష్ణ గారిని నేను ఎప్పుడూ మీ అమ్మాయిలను సినిమాల వైపు ఎందుకు తీసుకురాలేదని అడగలేదు. అయితే మా ఆవిడను అడిగాను. ‘నాకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇంట్లో కూడా అలాంటి డిస్క్రషన్ ఏమీ ఉండేది కాదు. ఇపుడు యాక్టింగ్ వైపు వెళ్లే థింకింగ్ లేదు' అని చెబుతుంటుంది. అయితే అప్పుడప్పుడూ నేను మా ఆవిడను నువ్వు యాక్టింగ్ వైపు వెళితే బావుండేది అంటుంటాను అని భరత్ చెప్పుకొచ్చారు.

English summary
It is very rare for Telugu girls to get into the film industry. It is only in recent times that girls have chosen acting as a career from the Star Families in the Industry. Laxmi from the Manchu family and Nihaka from Mega Family. But no one came from the Nandamuri family. In a recent TV channel interview, Balakrishna's son-in-law Bharat responded on the issue.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more