For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేము శత్రువులమా? చిరంజీవిని కలిస్తే ఇష్యూ చేస్తారెందుకు: జీవిత రాజశేఖర్

    By Bojja Kumar
    |

    చిరంజీవికి, జీవిత-రాజశేఖర్ దంపతులకు మధ్య ఒకప్పుడు విబేధాలు ఉండేవని ఎవరూ కాదనలేని సత్యం. గతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం. అయితే తర్వాతి కాలంలో పరిస్థితి మారింది. మళ్లీ ఇరు వర్గాల మధ్య స్నేహ సంబంధాలు చిగురించాయి.

    'పిఎస్‌వి గరుడవేగ' సినిమా విడుదల సందర్భంగా స్వయంగా వెళ్లి చిరంజీవిని కలిసిన రాజశేఖర్, జీవిత దంపతులు మెగాస్టార్‌ను ప్రీమియర్ షోకు ఆహ్వానించారు. అయితే ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ కావడం, గతంలో వీరి మధ్య జరిగిన గొడవలు తెరపైకి రావడంపై జీవిత రియాక్ట్ అయ్యారు.

    చిరంజీవిని కలిస్తే ఎందుకు ఇష్యూ చేస్తున్నారు?

    చిరంజీవిని కలిస్తే ఎందుకు ఇష్యూ చేస్తున్నారు?

    మేము చిరంజీవిగారిని కలిసినప్పుడల్లా ప్రతి ఒక్కరూ దీన్ని ఓ ఇష్యూగా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు. గడిచిన కొన్నేళ్లలో వివిధ ఈవెంట్లలో చిరంజీవిని తాము కలిశామని, మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని జీవిత తెలిపారు.

    అందరినీ ఎంటర్టెన్ చేయడానికే ఉన్నాం

    అందరినీ ఎంటర్టెన్ చేయడానికే ఉన్నాం

    సినిమా ఇండస్ట్రీలో మేమంతా ఉన్నది ప్రజలను ఎంటర్టెన్ చేయడానికే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఈ విషయాన్ని అనవసరంగా రచ్చ చేయవద్దని జీవిత సూచించారు.

    సీఎం, మహేష్ ఇంకా చాలా మంది పిలిచాము

    సీఎం, మహేష్ ఇంకా చాలా మంది పిలిచాము

    పిఎస్‌వి గరుడవేగ సినిమా ప్రీమియర్ షో కోసం ముఖ్యమంత్రితో పాటు, మహేష్ బాబు ఇంకా చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించామని, అదే విధంగా చిరంజీవి గారిని పిలిచామని జీవిత తెలిపారు. అయితే జీవిత సోదరుడు మరణించడంతో ప్రీమియర్ షో రద్దయిన విషయం తెలిసిందే.

    చాలా సంతోషంగా ఉంది

    చాలా సంతోషంగా ఉంది

    పిఎస్‌వి గరుడ వేగ సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. సినిమా చాలా బావుందని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు స్పెషల్ షో ఎరేంజ్ చేయాలని కోరుతున్నారు. ఈ సినిమా కోసం మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అని జీవిత చెప్పుకొచ్చారు.

    English summary
    “I don’t know why everyone makes it an issue when we meet Chiranjeevi garu. In the last few years, we met several times at various events. There is no rivalry between us. We are all here to entertain people and there are no differences between us.” says Jeevitha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X