Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మేము శత్రువులమా? చిరంజీవిని కలిస్తే ఇష్యూ చేస్తారెందుకు: జీవిత రాజశేఖర్
తాము చిరంజీవిని కలిసిన ప్రతిసారి మీడియాలో ఇష్యూ అవుతోందని జీవిత అన్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, శతృత్వం అంతకన్నా లేదని జీవిత తెలిపారు.
చిరంజీవికి, జీవిత-రాజశేఖర్ దంపతులకు మధ్య ఒకప్పుడు విబేధాలు ఉండేవని ఎవరూ కాదనలేని సత్యం. గతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం. అయితే తర్వాతి కాలంలో పరిస్థితి మారింది. మళ్లీ ఇరు వర్గాల మధ్య స్నేహ సంబంధాలు చిగురించాయి.
'పిఎస్వి గరుడవేగ' సినిమా విడుదల సందర్భంగా స్వయంగా వెళ్లి చిరంజీవిని కలిసిన రాజశేఖర్, జీవిత దంపతులు మెగాస్టార్‌ను ప్రీమియర్ షోకు ఆహ్వానించారు. అయితే ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ కావడం, గతంలో వీరి మధ్య జరిగిన గొడవలు తెరపైకి రావడంపై జీవిత రియాక్ట్ అయ్యారు.
చిరంజీవిని కలిస్తే ఎందుకు ఇష్యూ చేస్తున్నారు?
మేము చిరంజీవిగారిని కలిసినప్పుడల్లా ప్రతి ఒక్కరూ దీన్ని ఓ ఇష్యూగా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు. గడిచిన కొన్నేళ్లలో వివిధ ఈవెంట్లలో చిరంజీవిని తాము కలిశామని, మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని జీవిత తెలిపారు.
అందరినీ ఎంటర్టెన్ చేయడానికే ఉన్నాం
సినిమా ఇండస్ట్రీలో మేమంతా ఉన్నది ప్రజలను ఎంటర్టెన్ చేయడానికే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఈ విషయాన్ని అనవసరంగా రచ్చ చేయవద్దని జీవిత సూచించారు.
సీఎం, మహేష్ ఇంకా చాలా మంది పిలిచాము
పిఎస్వి గరుడవేగ సినిమా ప్రీమియర్ షో కోసం ముఖ్యమంత్రితో పాటు, మహేష్ బాబు ఇంకా చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించామని, అదే విధంగా చిరంజీవి గారిని పిలిచామని జీవిత తెలిపారు. అయితే జీవిత సోదరుడు మరణించడంతో ప్రీమియర్ షో రద్దయిన విషయం తెలిసిందే.
చాలా సంతోషంగా ఉంది
పిఎస్వి గరుడ వేగ సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. సినిమా చాలా బావుందని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు స్పెషల్ షో ఎరేంజ్ చేయాలని కోరుతున్నారు. ఈ సినిమా కోసం మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అని జీవిత చెప్పుకొచ్చారు.