జెన్నీ హఠాత్తుగా బన్నీని ఎందుకు పొగుడుతోంది..!?
'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ తర్వాత కథానాయిక జెనీలియాపై వచ్చిన కాంట్రావర్సీకి ఇక తన పని అయిపోయిందనుకున్నారంతా. ఎందుకంటే, ఆ సినిమా ప్రొడ్యూసర్ నాగబాబుని చివర్లో ఎగస్ట్రా అమౌంట్ డిమాండ్ చేసిందనీ, ఆ మొత్తం ఇస్తేనే కానీ ఆస్ట్రేలియా షూటింగుకి బయలుదేరలేదనీ టాలీవుడ్ లో జెన్నీ మీద చాలా బ్యాడ్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత ఎవరూ ఆమెను బుక్ చేయలేదు కూడా. అయితే, రానా కనికరించి తాజాగా తన 'నా ఇష్టం' సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్లీ హైదరాబాదులో షూటింగులో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఒక్కో హీరోనీ మళ్లీ బుట్టలో వేసుకునే కార్యక్రమాన్ని జెన్నీ మొదలెట్టిందని అంటున్నారు.
ఒక్కొక్కళ్ళకీ ఫోన్ చేసి 'హాయ్' చెబుతోందట. అలాగే, తాజాగా అల్లు అర్జున్ ని తెగ పొగిడివదిలింది. అసలు అర్జున్ అంతటి డ్యాన్సర్ లేడు... అంటూ ఆకాశానికి ఎత్తుతోంది. ఇంత అకస్మాత్తుగా బన్నీని పొగడడం ఎందుకబ్బా...? అని ఆలోచించిన వాళ్లకి ఓ విషయం అర్ధమవుతోంది. అదేమిటంటే, త్రివిక్రమ్ దర్శకత్వంలో అర్జున్ నటించనున్న సినిమాలో ఇలియానాని బుక్ చేశారు. తీరా ఇప్పుడామె పరిస్థితి బాగోలేదని తప్పిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ టైంలో ఓ రాయేస్తే పోలా... అన్న దృష్టితో బన్నీకి జెన్నీ ఇలా సోపేస్తోందని అంటున్నారు. ఈ సోపులకి బన్నీ పడతాడా?


Click it and Unblock the Notifications











