Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం ఘటన ముంబై నగరానికి వణుకు పుట్టించింది. అత్యంత సెక్యూరిటీ జోన్ బాంద్రాలోని సల్మాన్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో తూటాల వర్షం కురిపించడంతో సంచలనం రేపింది. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రాణాలకు హానీ తలపెట్టడం వెనుక ఎవరి హస్తం ఉందనే వివరాల్లోకి వెళితే..
ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి ముప్పు ఉంది. దేశంలోనే ముప్పు ఉన్న టాప్ 10 సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్ ఒకరు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ముద్దాయిగా ఉన్న సల్మాన్.. వాటిని చంపి తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీశారనే నెపంతో డెత్ వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా ఇచ్చిన సమాచారం ప్రకారం.. కృష్ణ జింకలను లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీ అత్యంత పవిత్రంగా పూజిస్తారు. వాటిని చంపిన కేసులో సల్మాన్ ముద్దాయి కావడంతో అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొంటున్నారు. ఆ క్రమంలోనే కొందరికి సుపారీ ఇచ్చి సల్మాన్ ఖాన్‌ను చంపించాలని ప్లాన్ చేశాడు అని పోలీసులకు వెల్లడించారు.
గోల్డీ బ్రార్ విషయానికి వస్తే.. కెనడాకె చెందిన గ్యాంగ్‌స్టర్. పంజాబ్‌లో గులాబేవాలాలోని ముఖ్త్‌సర్ గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు. కెనడా ప్రభుత్వం ప్రకటించిన అత్యంత కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్లలో బ్రార్ ఒకరు. ఇతనిపై భారత ప్రభుత్వ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇది ఇలా ఉండగా, సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిపిన కాల్పుల ఘటనపై పలువురు సినీ, రాజకీయ నేతలు ఖండించారు. శివసేన నాయకుడు ఆనంద్ దుబే ఘాటుగా స్పందించారు. ముంబై నగరంలో క్రిమినల్స్ యదేచ్ఛగా తిరుగుతున్నారు. ముంబై, మహారాష్ట్రలో సురక్షితంగా జీవించే పరిస్థితులు లేవు. ముంబైలోను, అలాగే ఓ ఎమ్మెల్యే కూడా కాల్పులు జరిపిన సంఘటనను ఉదహరించారు.


Click it and Unblock the Notifications











