గోపిచంద్ ఇక మారడా?: కనీసం పవన్‌ను చూసైనా.., ఇలా అయితే కష్టమే!

రొటీన్ మూస కథల్ని జనం నిర్మొహమాటంగా తిప్పికొడుతున్న రోజులివి. వాళ్లను మెప్పించాలంటే కొత్తదనంతో రావాల్సిందే తప్ప.. పాత కథకే కొత్త హంగులు అద్దితే సరిపోదు. బహుశా.. ఈ ఫార్మూలాను ఇంకా క్యాచ్ చేయలేకపోతున్నట్లున్నాడు హీరో గోపిచంద్. 'పంతం' అంటూ మరో పాత తరహా కథతోనే సినిమాకు సిద్దమైపోతున్నాడు. ఇలా అయితే గోపిచంద్ కెరీర్ ఇక ముందుకు సాగినట్లే! అంటున్నారు అభిమానులు..

 సెంటిమెంట్ రిపీట్.. :

సెంటిమెంట్ రిపీట్.. :

గోపిచంద్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. 'లక్ష్యం.. శౌర్యం.. శంఖం..లౌక్యం..శౌఖ్యం..' ఈ టైటిల్స్ చాలు ఆ సెంటిమెంట్ ఏంటో చెప్పడానికి. ఇప్పుడదే సెంటిమెంటును మరోసారి ఫాలో అవుతూ 'పంతం' అనే టైటిల్‌తో సినిమాకు సిద్దమైపోయాడు.

 ఇలా అయితే కష్టమే..

ఇలా అయితే కష్టమే..

అసలే టైటిల్ దగ్గరి నుంచి కథ-కథనాల వరకు అంతా కొత్తదనం కోరుకుంటున్న రోజుల్లో.. గోపిచంద్ ఈ చాదస్తపు సెంటిమెంటును పట్టుకుని వేలాడటమేంటి? అన్న విమర్శలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Recommended Video

Gopichand And Sampath Nandi New Movie Opening | Tollywood |
 పంతం.. ప్రతీకారం.. ఏంటిదంతా?:

పంతం.. ప్రతీకారం.. ఏంటిదంతా?:

'పంతం'.. అన్న టైటిల్‌లో ఎలాంటి వైబ్రేషన్ లేదు. ఇప్పటికీ ఎన్నోసార్లు వినేసి.. సినిమాల్లో ఆ కంటెంట్ చూసేసి జనం బోరు కొట్టేసి ఉన్నారు. పగ.. ప్రతీకారం.. పంతం.. శపథం.. ఇవన్నీ పరమ రొటీన్ అయిపోయాయి. అలాంటిది గోపిచంద్ మాత్రం ఇంకా అప్‌డేట్ అవకుండా.. పాత పంథాలోనే 'పంతం' అంటే కష్టమేమో!

గోపి ఇక మారడా?:

గోపి ఇక మారడా?:

నిజానికి గోపిచంద్‌లో మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. ఆరడుగుల హైట్.. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ.. ఇలా అంతా బాగానే ఉన్నా కథల ఎంపిక విషయంలో మాత్రం గోపిచంద్ మైండ్ సెట్ మారడం లేదు. యువ హీరోలంతా సరికొత్త కథల వెంబడి పరుగుతీస్తుంటే.. గోపీ మాత్రం మూసలోనే ఇరుక్కుపోతున్నారు.

పవన్‌ను చూసైనా..:

పవన్‌ను చూసైనా..:

కెరీర్‌లో 25వ సినిమా అంటే అత్యంత ప్రత్యేకమైనది. ఏ హీరో అయినా సరే.. 25వ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. అప్పటిదాకా చేసిన పాత్రలకు, కథలకు భిన్నంగా కాస్త కొత్తగా ట్రై చేయడానికి చూస్తారు. ఈ విషయాల్లో సరిగా కేర్ తీసుకోకపోవడం వల్లే పవన్ కల్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి దారుణంగా బోల్తా కొట్టింది. మరి గోపిచంద్ ఇవన్నీ గమనిస్తున్నాడో.. లేదో.. ఆయనకే తెలియాలి.

సాదాసీదా కథలతో ఎన్నాళ్లు..:

సాదాసీదా కథలతో ఎన్నాళ్లు..:

గోపిచంద్ చెప్పుకోదగ్గ హిట్టు కొట్టి చాన్నాళ్లయింది. అర్జెంటుగా ఆయనకో హిట్టు సినిమా కావాలి. హిట్టు కంటే బంపర్ హిట్టు కొడితేనే.. ఆయన కెరీర్ కు మళ్లీ ఓ ఊపు వస్తుంది. అయితే ఎప్పటిలాగే సాదాసీదా కథల్ని నమ్ముకుంటే మాత్రం ఫలితంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి గోపిచంద్ ఇప్పటికైనా తన పంథాను మార్చుకుంటే బెటరేమో అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X