‘ఆ ఘోరాలు అక్కడ చూపించలేక పోయా....అందుకే గన్స్ అండ్ థైస్’
‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ ను తీయడానికి గల కారణాలను చెబుతూ వర్మ తాజా ట్వీట్ చేశారు.
హైదరాబాద్: అండర్ వరల్డ్ మాఫియాకు సంబంధించిన విషయాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఉన్నంత గ్రిప్ ఇండియాలో మరేదర్శకుడికి లేదనే చెప్పాల్సి. అవర్డ్ వరల్డ్ మాఫియా చేస్తున్న నేరాలు, ఘోరాలను ధైర్యంగా తెరకెక్కించగల దర్శకుడు కూడా ఆర్జీవీనే.
అప్పట్లోనే ముంబై అండర్ వరల్డ్ మాఫియాపై 'సత్య' సినిమా తీసి సంచలన విజయం అందుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే సెన్సర్ నిబంధనల కారణంగా తాను తీయాలనుకున్న, చూపించాలనుకున్న ఎన్నో విషయాలను తెరపై చూపించలేక పోయారు.

డిజిటల్ వరల్డ్
ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తుండటం, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో సెన్సార్ నిబంధనలు లాంటి ఏమీ లేక పోడంతో...... మాఫియా గురించి తాను చెప్పాలనుకున్న, చూపించాలనుకున్న వాటిని చూపించేందుకు డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశించాడు వర్మ.

ఏకైక లక్ష్యం అదే
‘గన్స్ అండ్ థైస్' వెబ్ సిరీస్ ను తీయడానికి గల కారణాలను చెబుతూ వర్మ తాజా ట్వీట్ చేశారు. ‘డిజిటల్ వరల్డ్ లోకి నేను ప్రవేశించడానికి గల నా ఏకైక లక్ష్యం ఫిల్మ్ స్క్రీన్ పై అనుమతించని కథలను దీని ద్వారా చెప్పడమే అని వర్మ స్పష్టం చేసారు.

గన్స్ అండ్ థైస్
డిజిటల్ వరల్డ్ లో నా మొదటి ప్రయత్నం ‘గన్స్ అండ్ థైస్'. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు సీజన్లు ఉంటాయి. మొదటి సీజన్ లో పది ఎపిసోడ్స్ విడుదల చేస్తామని వర్మ తెలిపారు.

వాటి ఆధారంగానే
పోలీసులను, అండర్ వరల్డ్ కు చెందిన మధ్యవర్తులను హతమార్చిన మాజీ గ్యాంగ్ స్టర్స్ తో నాకు కొన్నేళ్లుగా ఉన్న విస్తృత పరిచయాలే ఈ సిరీస్ కు సంబంధించిన కథకు ఆధారం..' అంటూ వర్మ పేర్కొన్నారు.
గన్స్ అండ్ థైస్ సీజన్ 1 ట్రైలర్
నిన్న విడుదలైన గన్స్ అండ్ థైస్ ట్రైలర్...... వర్మ అభిమానులను ఎంతగానో ఆకట్టకుంది.


Click it and Unblock the Notifications











