మరదలితో అలా.. రాఘ‌వేంద్ర‌రావు మీద‌కి వెళ్లిన రాజశేఖర్, మైండ్‌లో ఇప్పటికీ

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్ కలిగిన విలక్షణ నటుడు డాక్టర్ రాజశేఖర్. ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి ఏడిపించినా.. అల్లరి ప్రియుడిగా గిలిగింతలు పెట్టించినా ఆయనకే చెల్లింది. పోలీస్ పాత్రలకు జీవం పోసి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు రాజశేఖర్ . కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలున్నా.. హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారాయన. రాజశేఖర్ పని అయిపోయిందని అవమానాలు ఎదుర్కొన్నప్పుడల్లా.. తన సినిమాలతోనే ఆయన ఆన్సర్ ఇచ్చేవారు.

కొద్దినెలల క్రితం పీఎస్‌వీ గరుడవేగతో తన విశ్వరూపం చూపించారు. ఆ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కిలో నటించి సత్తా చాటారు రాజశేఖర్. తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజశేఖర్ .. టాలీవుడ్‌లో సెలబ్రెటీ కపుల్‌గా మన్ననలు అందుకుంటున్నారు. ఈ దంపతులకు శివానీ, శివాత్మిక అనే కుమార్తెలున్నారు. వీరు హీరోయిన్స్‌గా రాణిస్తూ.. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నారు.

why hero Dr Rajasekhar fire on director Raghavendra rao here s the details

ఓ టైప్ క్యారెక్టర్లతో వెళ్తున్న రాజశేఖర్‌‌ను సరైన ట్రాక్‌లో పెట్టిన వ్యక్తి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అల్లరి ప్రియుడు .. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాజశేఖర్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది. రాజశేఖర్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేయడంతో పాటు రొమాంటిక్ ఇమేజ్‌ను కట్టబెట్టారు రాఘవేంద్రరావు. అలాంటి హిట్ ఇచ్చి తనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన దర్శకుడితో రాజశేఖర్ గొడవపడటం ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. గొడవే కాదు.. కొట్టుకోవడం వరకు కూడా విషయం వెళ్లిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత , రాజశేఖర్ మాట్లాడుతూ రాఘవేంద్రరావుతో గొడవపై క్లారిటీ ఇచ్చారు. మొదట్లో తాము చెన్నైలో ఉండేవాళ్లమని.. ఆ తర్వత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యామని.. పిల్లలను చూసుకునేందుకు చెల్లిని, తల్లిని హైదరాబాద్‌కు తీసుకొచ్చామని జీవిత చెప్పారు. దీంతో తన చెల్లి అప్పుడప్పుడు తన వెంట షూటింగ్‌లకు వచ్చేదని.. ఈ క్రమంలో రాఘవేంద్రరావుతో జీవిత చెల్లికి పరిచయం పెరిగిందట. చూడటానికి బాగుండటంతో ఆమెను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని పెద్దాయన భావించారట.

why hero Dr Rajasekhar fire on director Raghavendra rao here s the details

అయితే తరచుగా తన మరదలికి రాఘవేంద్రరావు ఫోన్ చేస్తున్న విషయం రాజశేఖర్‌కు కొందరు తప్పుగా ఎక్కించడంతో ఆయన కోపంతో ఊగిపోతూ రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడట. ఇది జరిగిన కొద్దిరోజులకు అసలు విషయం తెలిసి ఫీలయ్యానని రాజశేఖర్ తెలిపారు. ఇద్దరం వెళ్లి రాఘవేంద్రరావుకు సారీ చెప్పామని.. కానీ అది ఆయన మనసులో నాటుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజశేఖర్ అంటే ఓ హీరోయిన్‌కి బాగా ఇష్టమట... కానీ ఎప్పుడు చూసినా ఆయన పక్కన జీవిత ఉండటంతో తట్టుకోలేక ఇలా చేసిందని ఈ జంట వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X