బెదురులంక 2012 సక్సెస్ మీట్‌.. హీరోయిన్ నేహా శెట్టి డుమ్మా.. హీరో కార్తికేయ చెప్పిన కారణం ఏమిటంటే?

RX 100 మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా బెదురులంక 2012. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సీ యువరాజ్ సమర్పణలో నూతన దర్శకుడు క్లాక్స్ రూపొందించిన ఈ సినిమాను నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు.ఆగస్టు 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.

ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న హంగామా, సక్సెస్ మీట్‌లో బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ''మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు, మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉంది'' అని అన్నారు. ఇంకా ఇతర ప్రముఖుల స్పందన వివరాల్లోకి వెళితే..

Why Heroine Neha Sshetty absent for Bedurulanka 2012: Here is the Kartikeya reactions

బెదురులంక 2012 సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో కామెడీ పూర్తిస్థాయిలో పండటంతో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. తొలి రోజే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో తొలి రోజు మంచి కలెక్షన్లను నమోదు అయ్యాయి. గోదావరి పల్లె వాతావరణం, వెటకారంతో కూడిన హాస్యానికి రెస్సాన్ బ్రహ్మండంగా లభిస్తున్నది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 1.7 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

బాక్సాఫీస్ వద్ద బెదురు లంక సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో హీరో కార్తికేయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బెదురులంక సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. బెదరులంక 2012 మూవీ విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

Why Heroine Neha Sshetty absent for Bedurulanka 2012: Here is the Kartikeya reactions

ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏదైతే వర్కవుట్ అవుతుందోనని, ప్రేక్షకులకు ఏం అంశాలు నచ్చుతాయో అని అనుకున్నానో... వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. మూవీ సెకండాఫ్ నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నాం అని చెప్పడంతో నేను అనుకొన్నది నిజమైందనిపించింది అని కార్తీకేయ చెప్పారు.

బెదురులంక 2012 మూవీ సీరియస్ సాగే మూవీ. కానీ ఇలాంటి కామెడీ ట్రాక్‌తో చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఇలాంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను థియేటర్లకు వెళ్లి మూవీ చూడటమే కాకుండా ప్రేక్షకుల స్పందనను నేరుగా చూసినప్పుడు సంతోషం వేసింది. దర్శకుడు క్లాక్స్‌ను పరిచయం చేసినప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అభినందించారు. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బెన్నీ గారికి థాంక్స్ అని కార్తికేయ అన్నాడు.

Why Heroine Neha Sshetty absent for Bedurulanka 2012: Here is the Kartikeya reactions

ఒక టీమ్‌గా వర్క్ చేయడంతో బెదురులంక సినిమా మేము అనుకొన్న ఫలితాన్ని సొంతం చేసుకొంటున్నాం. హీరోయిన్ నేహా శెట్టి ఫ్యామిలీలో ఓ సమస్య ఏర్పడింది. ఎమర్జెన్సీ పని వల్ల నేహా శెట్టి రాలేకపోయింది. మా ట్రైలర్‌ విడుదల చేసిన రాంచరణ్‌ గారికి థాంక్స్‌. నా ఇన్స్‌పిరేషన్‌ మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో ఆయన పేరు శివ శంకర వరప్రసాద్‌ అని పెట్టుకున్నా. నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్‌ అని కార్తీకేయ అన్నారు.

బెదురులంక దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల ఆదరణ చూసి సక్సెస్ సాధిస్తున్న ఈ తరుణంలో ఏం మాట్లాడాలో నాకు తెలియదు. నా కథను నమ్మిన బెన్నీ గారికి, కార్తికేయ గారికి, మా టీం అందరికీ థాంక్స్. సాయి ప్రకాష్, సన్నీ కూరపాటి... మా సినిమాటోగ్రాఫర్లకు, మణిశర్మ గారికి కూడా థాంక్స్. మా సినిమా 'బెదురులంక 2012'లో సెకండాఫ్ బాగుంది. ఈ విజయం వెనుక టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా థాంక్స్. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నారని చెబుతున్నారు. మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X