ఎయిడ్స్ మీద తీసిన షార్ట్ ఫిలిం నచ్చే...: రాజమౌళి
అలాగే...నిర్మాతగా నా పేరుని తొలిసారి తెర మీద చూసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా మొదలైనప్పుడు ఇందులో నేను భాగస్వామిని కాదు. అలాగే 'ఈగ' కథలోని ఎమోషన్‌ని అర్థం చేసుకుని సాయి కొర్రపాటి నన్ను బాగా ప్రోత్సహించారు అన్నారు రాజమౌళి. నూతన జంట నవీన్‌చంద్రరాహుల్, లావణ్య నటించిన 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మాతగా మారుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వారాహి చలన చిత్రపతాకంపై రూపొందుతోంది. ఆగస్ట్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
'దిల్' రాజు మాట్లాడుతూ -''ఈ చిత్రాన్ని కొనమని అడగకుండా, ఒకసారి చూడమని సాయి అడిగాడు. కథ చాలా బాగుంది. కొత్తవారు నటించినట్లుగా, కొత్త దర్శకుడు తీసినట్లుగా లేదు. నెల రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం ప్రోమోస్, ఆడియో అందరిలో క్యూరియాసిటీ రేకెత్తించాయి. మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం విడుదల చేస్తున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు హను మాట్లాడుతూ... "సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య ఓ ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుందో మా సినిమాలో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ కూడా అలానే ఉంటుంది. 1990ల్లో జరిగిన ప్రేమ కథ ఇది. ఓ అందమైన దృశ్య కావ్యంలా చూపించే ప్రయత్నం చేశాం. రధన్ అందించిన స్వరాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి" అన్నారు. ఈ సమావేశంలో సాయి కొర్రపాటి, హను రాఘవపూడి కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












