నేను హాస్పటల్ పాలవటానికి అస్సలు కారణం అది: ఇలియానా
ఇలియానా రీసెంట్ గా హాస్పటిల్ లో చేరిందని, అక్కడ చికిత్సపొందుతోందని ఆమె సోదరి ఫరా డిసౌజా ట్విట్టర్లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు కోలుకున్న ఆమెను కలసిన మీడియా తో మాట్లాడుతూ..ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. వైరల్ జ్వరం మూలంగా నీరసపడ్డాను. అంతే తప్ప మరేమీ కాదు. శంకర్ సినిమా కోసం అండమాన్‌లో చిత్రీకరణ చేశాం. రోజూ బోటులో చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇబ్బందికరమైన ప్రయాణం. అక్కడ షూటింగ్ ముగియగానే ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లాను. ఆ వాతావరణం అనుకూలించలేదు. దాంతో ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చింది. ఇప్పుడంతా బాగానే ఉంది అంది.అయితే దీన్ని సినీ పరిశ్రమలో వారు నమ్మటం లేదు. వరసగా ఎన్టీఆర్‌తో కలిసి 'శక్తి' సినిమా, రానాతో 'నేను నా రాక్షసి'సినిమా ప్లాపవటంతో నిపరీతమైన డిప్రెషన్ కి గురి అయిందని అందుకే ఆమె అస్వస్ధతకు లోనైందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











