రామ్ చరణ్ తీరుపై ప్రియాంక చోప్రా మండిపాటు!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిసి 'జంజీర్' అనే హిందీ చిత్రంలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈచిత్రం సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్, ప్రియాంక చోప్రా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు.
అయితే ఇటీవల రామ్ చరణ్ తీరు నచ్చక ప్రియాంక చోప్రా ఆగ్రహానికి గురైనట్లు బాలీవుడ్ టాక్. జంజీర్ మూవీ ప్రమోషన్ కార్యమాలకు ప్రియాంక సమయానికి హాజరవుతుంటే....రామ్ చరణ్ మాత్రం ఆలస్యంగా వస్తున్నాడట, దీని కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలు లేటుగా మొదలవుతున్నాయట. రామ్ చరణ్ మూలంగా సమయం అంతా వేస్ట్ అవుతోందని ఆమె మండి పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి పక్కన పెడితే...జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. జంజీర్ చిత్రం విడుదల కాకముందే రామ్ చరణ్‌కు మరో 10 బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని జంజీర్ దర్శకుడు అపూర్వ లఖియా వెల్లడించారు.
జంజీర్ చిత్రం విషయానికొస్తే...రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications












