మహేష్ బాబు కంటే రామ్ చాలా లక్కీ... ఎందుకంటే?
మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' చిత్రంలో ఉచ్చ పోయిస్తా అనే డైలాగ్ ఎంత వివాదాస్పదం అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. చివరకు సెన్సార్ బోర్డు సినిమాలో ఆ పదాన్ని తొలగించే వరకు నిద్రపోలేదు. సినిమాకు చాలా మెయిన్ డైలాగ్ అయిన దాన్ని తొలగించడంతో హీరో మహేష్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు అభిమానులు కూడా చాలా డిస్సప్పాయింట్ అయ్యారు.
తాజాగా రామ్ నటించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం విడుదలైన నేపథ్యంలో 'ఉచ్చ' డైలాగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పారిస్‌లో జరిగే ఓ సీన్లో హీరోయిన్ తమన్నా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.....'దెయ్యం అంటే భయం కాదు ఉచ్చ' అనే డైలాగ్ కొడతాడు హీరో రామ్.
అయితే 'బిజినెస్ మేన్' చిత్రం విషయంలో 'ఉచ్చ' డైలాగ్‌కు నో చెప్పిన సెన్సార్ బోర్డు.....'ఎందుకంటే ప్రేమంట' చిత్రం విషయంలో మాత్రం ఎలా అనుమతి ఇచ్చింది అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు ఇలా జరిగింది అని ఆరా తీస్తే... ఏపీ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ ధనలక్ష్మి ఏదో ట్రైనింగ్ నిమిత్తం న్యూఢిల్లీలో ఉన్నారని, బెంగుళూరు సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహించారని, ఆ కారణంగానే ఆ సినిమాలో 'ఉచ్చ' డైలాగ్ తొలగించ లేదని అంటున్నారు.
ఏది ఏమైనా ధనలక్ష్మి మేడమ్ లేక పోవడంతో ఈ విషయంలో మహేష్ బాబు కంటే రామ్ చాలా లక్కీగా మారాడని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నారు.
రామ్, తమన్నా జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ రూపొందించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం జూన్ 8న విడుదైంది. అయితే సినిమా తొలి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఆశించిన రేంజిలో లేదని, స్టోరీలైన్..స్క్కీన్ ప్లేలో లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











