ఫోటోలు : షారుక్ కొడుకు ముఖం చాటేసాడెందుకు?
హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరోయి షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ మీడియా కెమెరా కెమెరాల ముందు ఫోజులు ఇచ్చేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు. కానీ వాళ్ల తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం మీడియా కెమెరాలు కనిపిస్తే చాలు ముఖం చాటేస్తున్నాడు. ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో మీడియా వారు కనిపించగానే వారికి దొరక్కుండా తుర్రుమన్నాడు.
ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం తన హైయ్యర్ స్టడీస్ నిమిత్తం లండన్లో ఉంటున్నాడు. లండన్లోని ప్రఖ్యాత సెవెనోక్స్ స్కూల్‌లో చదువతున్నాడు. షారుక్-గౌరీ కావాలనే ఆర్యన్‌ను మీడియాకు దూరంగా ఉంచుతున్నారని, అందుకే చదువుల నిమిత్తం లండన్ పంపారని బాలీవుడ్ టాక్.
ఫ్యామిలీతో గడిపి వెళ్లేందుకే ఆర్యన్ ఇటీవల ఇండియా వచ్చాడు. ఇటీవల షారుక్‌కు భుజం సర్జరీ జరుడం కూడా ఆర్యన్ రాకకు కారణమని తెలుస్తోంది. 'కభి ఖుషి కభి గమ్' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసిన ఆర్యన్ ఖాన్ భవిష్యత్‌లో హీరోగా పరిచయం కాబోతున్నాడు. అందుకు తగిన విధంగానే అతన్ని సిద్దం చేస్తున్నారు తల్లిదండ్రులు.
ఇప్పటికే ఆర్యన్ హిందీ వెర్షన్ 'ఇన్ క్రెడబుల్స్'కు డబ్బింగ్ చెప్పి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర తైక్వాండో కాంపిటీషన్ 2010లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. భవిష్యత్ లో ఆర్యన్ స్టార్ హీరోగా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

ఇటీవల లండన్ నుంచి తిరిగి వస్తూ ఆర్యన్ ముంబై ఎయిర్ పోర్టులో ఇలా మీడియాకు కనిపించకుండా ముఖం చాటేసాడు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన ఇద్దరు పిల్లు సుహానా, ఆర్యన్‌తో ఇలా....

ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం హైయ్యర్ స్టడీస్ నిమిత్తం లండన్లోని ప్రఖ్యాత సెవెనోక్స్ స్కూల్‌లో చదువుతున్నాడు.

మహారాష్ట్ర తైక్వాండో కాంపిటీషన్ 2010లో గోల్డ్ మెడల్ సాధించిన ఆర్యన్

షారుక్ నటించిన ‘కభి ఖుషి కభి గమ్' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసిన ఆర్యన్ ఖాన్ భవిష్యత్‌లో హీరోగా పరిచయం కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











