సిద్దార్ధకి మీడియాకి మధ్య గొడవ ఎలా మొదలైంది?
సిద్దార్దని ఇప్పుడు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా బాయ్ కాట్ చేసి,క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం సిద్దార్ద కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ లో మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూస్ ఛానల్స్ దర్డ్ గ్రేడ్ గా మారాయని, ఒక గంటసేపు టవీని నడపడం కోసం తమ కుటుంబ సభ్యులకు కూడా అమ్ముకుంటారని, చెత్తచెదారం చూపిస్తారని, అబద్దాలు ప్రసారం చేస్తారని వ్యాఖ్యానించారు.
మీడియాను ఉద్దేశించి ఆయన కామెంట్ చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా ఇది ఛానెల్స్ వారికి మండిపోయింది. అయితే సిద్దార్ధ ఇలా కామెంట్ చేయటానికి కారణం..సిద్దార్ద తాజా చిత్రం '180' విడుదలకు ముందు..లోకల్ న్యూస్, ఎన్ టీవీ, ఎబిఎన్ ఛానెల్స్ వారు ఈ సినిమాపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసాయి. వారంతా ఈ సినిమాకు పెద్దగా జనంలో రెస్పాన్స్ లేదని, ఆసక్తి కనపడటం లేదని ఉన్నదున్నట్లు ప్రసారం చేసాయి. దాంతో సిద్దార్దకు కాలి ఇలా మీడియాను కామెంట్ చేస్తూ ఇరుక్కుపోయాడు.


Click it and Unblock the Notifications











